Karthika Nair: అక్కినేని నాగచైతన్య “జోష్” అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. 2009లో వచ్చిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రాధా కుమార్తె కార్తీకా నాయర్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించిన కార్తీకా తల్లి రాధా మాదిరిగా హీరోయిన్ గా రాణించలేకపోయింది. దీంతో కొన్నాళ్లకు సినిమా ఇండస్ట్రీ నుండి పూర్తిగా వ్యాపార రంగంపై దృష్టి పెట్టి అక్కడ స్థిరపడటం జరిగింది. కార్తీకా వ్యాపార రంగంలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవటం జరిగింది. దుబాయ్ లో కూడా కంపెనీలు స్థాపించి అక్కడ చక్కగా విజయవంతంగా బిజినెస్ రన్ చేస్తూ దుబాయ్ ప్రభుత్వం చేత గౌరవించబడింది. ఈ క్రమంలో రోహిత్ మీనన్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడి కార్తీక.. కొన్ని ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించింది.
ఆ తర్వాత వీరి ఇరువురు తమ ప్రేమని ఇరు కుటుంబ పెద్దలకు తెలియజేసి ఒప్పించారు. దీంతో ఆదివారం కేరళలోని త్రివేండ్రంలో కేరళ సాంప్రదాయపద్ధంగా ఒకటవటం జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి కోలీవుడ్ స్టార్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్ స్టార్స్ కూడా హాజరయ్యారు. తెలుగు చలనచిత్ర రంగం నుండి మెగాస్టార్ చిరంజీవి పెళ్లి వేడుకలలో సందడి చేశారు. ఇంకా ఈ పెళ్లి వేడుకలకు జాకీశ్రాఫ్, రాధిక, సుహాసిని, రేవతి తదితరులు హాజరయ్యారు. అప్పట్లో రాధాతో పాటు నటించిన చాలామంది సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు రావడం జరిగింది. ఈ క్రమంలో కార్తీకా పెళ్లికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నటి రాధిక కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ పెళ్లి వేడుకల ఫోటోలను పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్తీకా తల్లి రాధాతో అప్పట్లో చిరంజీవి దాదాపు 16 సినిమాలు చేయడం జరిగింది. రాధా ఒక చిరంజీవితో మాత్రమే కాదు బాలకృష్ణతో ఆరు సినిమాలలో నటించింది. ఎన్టీఆర్ అదేవిధంగా ఏఎన్ఆర్, కృష్ణంరాజు, శోభన్ బాబు, వంటి లెజెండరీ హీరోలతో కూడా ఆమె సినిమాలు చేయడం జరిగింది. అదేవిధంగా వెంకటేష్ మరియు నాగార్జునలతో కూడా సినిమాలు చేసింది.