Akkineni Naga Chaitanya: సమంత- నాగ చైతన్య తమ వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతూ ఎప్పుడైతే విడాకుల ప్రకటన చేశారో అప్పటినుంచి వీరిద్దరి వ్యక్తిగత విషయాలపై ఎన్నో రూమర్స్ బయటకొచ్చాయి. అక్కినేని ఫ్యామిలీ కండీషన్స్, సమంత బిహేవియర్ అంటూ బోలెడన్ని పుకార్లు షికారు చేశాయి. అయితే ఇటు సమంత గానీ, అటు అక్కినేని ఫ్యామిలీ గానీ వీటన్నింటీ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో పెద్దఎత్తున గాసిప్స్ హవా నడిచింది. ఈ క్రమంలోనే తాజాగా నాగ చైతన్య రెండో పెళ్లి అంటూ మరో వార్త బయటకు రావడం జనాల్లో హాట్ టాపిక్ అయింది

విడాకుల ప్రకటన తర్వాత సినిమాలతో బిజీ అయిన నాగ చైతన్య రెండో పెళ్ళికి సిద్ధమయ్యారని, ఈ మేరకు లోలోపల అక్కినేని ఫ్యామిలీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారనే టాక్ బయటకొచ్చింది. అది కూడా ఓ యంగ్ హీరోయిన్‌తో చైతూ పెళ్లి జరగనుందంటూ వార్తలు వైరల్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. అయితే సదరు హీరోయిన్ ఎవరనే దానిపై క్లారిటీ లేదు కానీ ప్రచారం మాత్రం ఊపందుకుంది. అది రూమర్ అని ఊరుకున్నారు జనం.
నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి ఆగకుండా. నాగార్జున ఇప్పటికే అమ్మాయిని ఫిక్స్ చేశారని ఒక సమాచారం. ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడట. అమ్మాయి కుటుంబానికి సినిమా పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదాని వార్త . ఇప్పటికే పెళ్లికి సంబంధించిన మాట ముచ్చట కూడా పూర్తి అయినట్లు ఆ వార్తల సారాంశం. అయితే, దీనిపై అక్కినేటి కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. ఇదీ రూమేరె అని ఊరుకున్నారు.

ఇదిలా ఉంటే.. ఇంకో వార్త నాగ చైతన్యకు రెండో పెళ్లి చేసేందుకు నాగార్జున భారీ రేంజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తమ దగ్గరి బంధువుల అమ్మాయితో చైతూకి పెళ్లి చేయాలని ఆయన డిసైడ్ అయ్యారట. ఈ అమ్మాయి ఫాదర్ బడా బిజినెస్‌మెన్ అని సమాచారం. ఈ మేరకు లోలోపల సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. ఈ సారి నాగ చైతన్య పర్సనల్ లైఫ్ లో ఉన్న ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పెట్టేలా నాగ్ ప్లాన్ చేస్తున్నారట. ఇది ఇంకో రూమర్ కానీ శోభిత దూళిపాళ్లతో నాగ చైతన్య సన్నిహితంగా ఉంటున్నారని.. వారిద్దరూ తరచుగా వెకేషన్స్‌కి వెళుతున్నారనే టాక్ అయితే నడిచింది. నాగ చైతన్య కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి పలుమార్లు ఆమెను తీసుకెళ్లాడని, శోభితను వివాహం చేసుకోవాలని చైతూ ఫిక్సయినట్లు ఓ రేంజ్ డిస్కషన్స్ నడిచాయి. నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ డేటింగ్ పుకార్లు కొత్త కాదు. ఇప్పుడు, ఈ జంటకు సన్నిహిత మూలం ఇండియా టుడేతో మాట్లాడుతూ, ఇద్దరూ “తమ సంబంధాన్ని త్వరలో బహిరంగపరచాలనే ఆలోచనను చర్చిస్తున్నారు మరియు పరిశీలిస్తున్నారు”.
అతను ఇప్పటికీ శోభిత తో డేటింగ్ చేస్తున్నాడు మరియు వారు స్నేహం బలంగా ఉన్నది . ఈ జంట తమ సంబంధాన్ని త్వరలో బహిరంగపరచాలనే ఆలోచనను చర్చిస్తున్నారు మరియు పరిశీలిస్తున్నారు. బహిరంగంగా తమ ప్రేమను బహిరంగంగా అంగీకరిస్తున్నారు కూడా.