సమంత – రమ్యకృష్ణ-విజయ్ సేతుపతి కాంబోలో రానున్న ఫిల్మ్ ‘సూపర్ డీలక్స్’. షూటింగ్ పార్ట్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు కొత్తగా సాగిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది. అస్సలు కథని రివీల్ చెయ్యకుండా కట్ చేసిన ట్రైలర్ తో సినిమాని ఒక పిట్ట కథ రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. లేడీ గెటప్ లో కనిపించిన విజయ్ సేతుపతి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పిన ఈ కథ ఒక పజిల్ లాగా ఉంది.
విజయ్ – సమంతలతో పాటు ఫాహద్ ఫాజిల్ – రమ్యకృష్ణ లాంటి మంచి నటులు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ప్లే చెయ్యడం సూపర్ డీలక్స్ సినిమాకి ప్రధాన బలంగా మారింది. నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ తీసిన డైరెక్టర్ త్యాగరాజన్ ఎంతో కష్టపడి మరో వైవిధ్యమైన సినిమా తీశాడని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ట్రైలర్ లోని మ్యూజిక్ – సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సూపర్ డీలక్స్ సినిమా మార్చ్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.