Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పాండమిక్ ప్రభావం తగ్గిన తర్వాత తెలుగు చలనచిత్ర రంగంలో చిరంజీవి మాదిరిగా సినిమాలు చేస్తున్న హీరో మరొకరు లేరని చెప్పవచ్చు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత చిరంజీవి ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదల చేయడం జరిగింది. ఈ మూడింటిలో రెండు సూపర్ హిట్ అయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వచ్చిన “వాల్తేరు వీరయ్య” చిరంజీవి కెరియర్ లో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా… రికార్డుల సృష్టించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో “బోళ శంకర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
తమిళ “వేదాలం” సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో… తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు నెలలో ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమాలో అక్కినేని కుటుంబానికి చెందిన అక్కినేని సుశాంత్ కీలక పాత్ర చేస్తున్నారు. కీర్తి బాయ్ ఫ్రెండ్ గా కనిపించనున్నారు అంట. అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్.. పెద్దగా రాణించలేకపోయారు. స్క్రీన్ ఎంట్రీ ఇచ్చే 15 సంవత్సరాలు కావచ్చిన గాని చెప్పుకోదగ్గ హీట్ కొట్టలేదు. ఆ తర్వాత సుశాంత్ పెద్దగా సినిమాలు చేయలేదు.
కానీ 2020 నుండి “అల వైకుంఠపురములో” చిత్రంతో సెకండ్ హీరోగా మారాడు. ‘రావణాసుర’ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో కూడా ఆఫర్ కొట్టేయడం జరిగింది. వైవిధ్యమైన పాత్రలో చిరంజీవి ఈ సినిమాలో కనిపించనున్నారు. చాలా సంవత్సరాల తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వం చేస్తూ ఉండటంతో…”భోళా శంకర్” సినిమా ఫలితం పై మెగా ఫ్యాన్స్ చాలా టెన్షన్ పడుతున్నారు.