బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ వరుస విజయాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు. సౌత్‌లో ముఖ్యంగా తెలుగు, తమిళ చిత్రాల బాలీవుడ్ రీమేక్స్‌లో నటించడానికి ఆక్షయ్కుమార్ ఎప్పుడూ ఆసక్తిని చూపుతుంటారు. విక్రమార్కుడు, తుపాకీ చిత్రాల బాలీవుడ్ రీమేక్‌లో నటించారు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాలను సాధించాయి. తాజాగా.. ఈయన తమిళ చిత్రం `వీరమ్` రీమేక్‌ను `బచ్చన్ పాండే` పేరుతో రీమేక్ చేస్తున్నారు. కాగా.. ఇప్పుడు మరో తమిళ సినిమా రీమేక్ చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ సినిమా ఏదో కాదు.. `కత్తి`. 2014లో విజయ్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. తెలుగులోనూ చిరంజీవి హీరోగా `ఖైదీ నంబర్ 150` పేరుతో రీమేక్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు అక్షయ్ పిక్చర్స్ నిర్మించనుంది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
previous post