ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ హవా కొనసాగుతూనే ఉంది. ఇప్పట్లో హవా తగ్గేలా లేదు. రీసెంట్గా ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌గా నిలిచిన పి.వి.సింధు బయోపిక్‌ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుంది. సోనూసూద్ ఈ చిత్రాన్నినిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో నటీనటులెవరు? అనే సంగతి ఇంకా ఫైనలైజ్ కాలేదు. కానీ.. సోషల్ మీడియాలో మాత్రం పలు వార్తలు వినపడుతున్నాయి. పి.వి.సింధు బయోపిక్‌లో ఆమె బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తాడనే వార్తలు వినపడ్డాయి. దీనిపై గోపీచంద్ కూడా స్పందించారు. నాకు అక్షయ్కుమార్గారంటే చాలా ఇష్టం. నా పాత్రను ఆయన చేస్తే బావుంటుంది. అయితే బయోపిక్‌పై నాకు స్పష్టత లేదు` అని పేర్కొన్నారు.
previous post
next post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!