Liger: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేసిన సినిమా “లైగర్”. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయింది. ఆగస్టు 25 వ తారీకు విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. చాయ్ వాల నుండి అంతర్జాతీయ బాక్సర్ గా విజయ్ దేవరకొండ ఎలా ఎదిగాడు అనే దానిపై “లైగర్” స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఉండటంతో.. మరింత అంచనాలు నెలకొన్నాయి.
అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి తాజాగా కమెడియన్ ఆలీ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. చేసిన వ్యాఖ్యలు “లైగర్” పై మరింత అంచనాలు పెంచేశాయి. ఆలీ ఏమన్నారంటే …ఇప్పటిదాకా ఓరేంజ్ సినిమాలు పూరీ చేశాడు…”లైగర్” ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయి సినిమా కాదు. హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. ఆల్రెడీ టాలీవుడ్ లో పూరి జెండా పాతేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో జస్ట్ ఇప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీలో జెండా ముట్టించాడు. గ్యారెంటీగా హాలీవుడ్.. బాలీవుడ్ లో..”లైగర్” తో… తన సత్తా ఏంటో నిరూపించుకోబోతూన్నాడు అంటూ పూరిపై సంచలన కామెంట్ చేయడం జరిగింది. కెరియర్ పరంగా నష్టపోయిన సమయంలో ఆలీ .. నాకు సాయం చేశాడు నేను మర్చిపోలేను అంటూ పూరి ఒక సందర్భంలో తెలిపారు. ఇంతకీ మీరు చేసిన సహాయం ఏంటి అని యాంకర్ ప్రశ్నించిన క్రమంలో… అది ఇప్పుడు చెప్పే సందర్భం కాదు ఆగస్టు 25 వ తారీకు “లైగర్” విడుదలవుతోంది రికార్డుల మోత మోగిస్తోంది అంటూ ఆలీ సంచలన కామెంట్స్ చేశారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!