ఎక్కడో సామెతో చెప్పినట్లు దేన్నో ఏదో కరిస్తే ఏదో అయ్యిందట ..అలా కంగనా పరిస్థితి తయారైంది. ఎందుకంటే నిర్మొహమాటంగా మాట్లాడే ఈమె తత్వానికి రీసెంట్గా `మణికర్ణిక` రూపంలో సక్సెస్ కూడా తోడైంది. దీంతో సోషల్ మీడియాలో ఎవరిపై కోపం ఉంటే వారిపై రివర్స్గానే మాట్లాడుతుంది కంగనా ఇటీవల అలియాభట్ను టార్గెట్ చేసుకుని జాతీయ, రాజకీయ వ్యవహారాలపై అలియాకు బాధ్యత లేదు అంటూ కంగనా మాట్లాడింది. దీనిపై అలియా స్పందించింది ఒకపక్క ఆమెను మెచ్చుకుంటూనే కంగనాకు కౌంటర్ వేసేసింది.
కంగనా తరహాలో నేను నిర్మొహమాటంగా మాట్లాడలేదు. ఆ విషయంలో ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ప్రపంచంలో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అభిప్రాయం ఉంటుందని నాన్న చెబుతుంటారు. అయితే ఒకరి అభిప్రాయంతో ఏమీ చేయలేం. ఆమెలా నేను చెప్పలేను. నా అభిప్రాయాలను మనసులోనే ఉంచుకుంటాను“ అంటూ ఒక వైపు మెచ్చుకుంటూనే కౌంటరేసింది అలియా.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!