RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు.
గత ఏడాదే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జనవరిలో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ మూవీని మార్చి 25న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు ప్రమోషన్స్ షురూ చేశారు.
అయితే రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అలియా భట్ షాక్ ఇచ్చింది. అసలు ఏమైందంటే.. ఈ సినిమాకు సంబంధించి జనవరిలో విస్తృతంగా ప్రమోట్ చేసింది టీమ్. అప్పుడు ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గోన్న అలియా భట్.. ఈసారి మాత్రం దూరంగా ఉంటుందట.
అందుకు ఆమె ముందుగా ఒప్పుకున్న కొన్ని సినిమాలే కారణమని కొందరు అంటుంటే.. గతంలో ఆమె ప్రమోషన్ బిల్లులే దాదాపు మూడు కోట్లకు పైగా అయ్యాయని మరి కొందరు అంటున్నారు. అందుకారణంగానే అలియా భట్ ఈసారి ప్రమోషన్స్‌కు రానని రాజమౌళికి చెప్పేసినట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ పాన్ ఇండియా మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించబోతున్నారు. ఎం. ఎం. కీరవాణి స్వరాలు అందించారు.