Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ `ఆర్ఆర్ఆర్` సినిమాతో తొలిసారి టాలీవుడ్‌కి పరిచయం అయింది. నేడు విడుదలైన ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన సీత పాత్రను పోషించిన అలియా భట్.. తనదైన నటనతో ప్రేక్షకులను మిస్మరైజ్ చేసింది. అలాగే మొన్నా మధ్య ఈమె నటించిన `గంగూభాయ్ కతియావాడి` చిత్రం సైతం మంచి విజయం సాధింది.
మొత్తానికి సక్సెస్ జ్యోష్‌లో ఉన్న ఈ బ్యూటీ.. వెడ్డింగ్‌కు సిద్ధమైందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. చిన్ననాటి నుంచి స్నేహితులైన వీరిద్దరూ త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. గత ఏడాదే ఈ జంట పెళ్లి చేసుకోవాలని భావించినా కరోనా కారణంగా వాయిదా పడింది.
అయితే ఇప్పుడు అలియా, రణ్‌బీర్ వివాహానికి కుటుంబ సభ్యులు డేట్ ఫిక్స్ చేశారట. ఏప్రిల్ నెలలోనే వీరి పెళ్లి ముమూర్తం ఖరారు అయిందని.. ఇరు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు సైతం ప్రారంభించారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ఇటీవల `రణ్‌బీర్‌తో మానసికంగా నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది. నా చిన్నప్పుడు రణ్‌బీర్‌ను మొదటిసారి స్క్రీన్‌పై చూసినప్పుడే పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకోవాలని డిసైడ్ అయ్యాను` అంటూ అలియా చెప్పుకొచ్చింది. అప్పుడామె కామెంట్స్ నెట్టింట ఎంతలా వైరల్ అయ్యాయో తెలిసిందే. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అలియా, రణ్‌బీర్ కలిసి `బ్రహ్మాస్త్ర` సినిమా చేస్తున్నారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.