ఆర్టిస్టులకు ఓ సారి క్రేజ్ వచ్చిందంటే చాలు.. దర్శక నిర్మాతలు ఎంత రెమ్యునరేషన్ అయినా ఇవ్వడానికి సిద్ధపడతారు. బాలీవుడ్ తార ఆలియా భట్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. రాజి సినిమా సక్సెస్‌తో ఆలియాకు క్రేజ్ పెరిగింది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఈమె సినిమాల్లో నటిస్తుంది. బాలీవుడ్ సినిమాల్లో నటించడానికి 9 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను తీసుకుంటుంది ఆలియా. ఇప్పుడు ఈమెను టాలీవుడ్ సినిమాలో నటింప చేయడానికి రాజమౌళికి కథ పరంగా ఓకే. అదే సమయంలో రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. వివరాల ప్రకారం `ఆర్ ఆర్ ఆ`ర్లో నటించడానికి ఆలియా భట్‌కు 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారని అంటున్నారు.
`ఆర్ ఆర్ ఆర్`లో ఆలియా అల్లూరి సీతా రామరాజు మరదలు సీత పాత్రలో నటిస్తుంది. ఇద్దరు రియల్ టైం హీరోలకు సంబంధించిన ఫిక్షనల్ స్టోరి ఇది. వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తుంటే.. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.
previous post
next post