Alia Bhatt- Ranbir Kapoor: బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ పెళ్లికి రెడీ అయిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్ల నుండీ ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఏప్రిల్ 17న మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఏప్రిల్ 13 నుంచే పెళ్లి సంబరాలు షురూ కానున్నాయి. వివాహానికి ముందు జరిగే మెహందీ, సంగీత్, బ్యాచ్‌లర్ పార్టీ వంటి వేడుకలు కపూర్ వంశానికి చెందిన పురాతన వారసత్వ నివాసం ఆర్కే స్టూడియోలో జరగబోతున్నాయి.
పెళ్లి వేదిక మాత్రం ముంబై, చెంబూర్ లోని రణబీర్ కపూర్ ఇంట్లో వైభంగా జరగనుంది. ఇందుకే సర్వం సిద్ధం చేస్తున్నారు. పంజాబీ సంప్రదాయంలో అలియా-రణ్‌బీర్ ల వివాహం జరగబోతోంది. అయితే ఇప్పుడు వీరి పెళ్లికి హాజరు అయ్యే గెస్ట్‌ల లిస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.
అలియాభట్, రణబీర్ వివాహం కేవలం కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే జరగనుందని మొదటి నుంచీ ప్రచారం జరుగుతుండటంతో.. అతిధులు ఓ యాబై మంది దాకా ఉంటారని అందరూ అంచనాలు వేశారు. కానీ, వీరి పెళ్లికి 28 మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నారట.
ఈ విషయానికి అలియాభట్ సోదరుడు రాహుల్ భట్ తెలిపారు. వీరిలో అధిక శాతం కుటుంబ సభ్యులేనని.. బస్సులో చెంబూర్ కు వస్తారని రాహుల్ భట్ పేర్కొన్నాడు. దీంతో అలియా-రణ్‌బీర్ ల వివాహానికి బాలీవుడ్ ప్రముఖుల్లో ఎవరికీ ఆహ్వానం ఉండదని స్పష్టంగా అర్థమైంది.