ప్రస్తుతం సినిమా రంగంలోని ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ మల్టీ టాస్క్‌లను నిర్వహిస్తున్నారు. ఆర్టిస్టులు కేవలం నటనకే పరిమితం కాకుండా.. సినిమా నిర్మాణ రంగం, థియేటర్స్, హోటల్స్, బొటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్ … ఇలా తమకు అనుకూలమైన రంగాల్లో తమ సంపాదనను ఇన్వెస్ట్ చేస్తున్నారు. సక్సెస్ సాధిస్తున్నారు. ఇప్పుడు ఆ బాటలోకి అడుగు పెట్టనుంది మరో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్. ఈమె తండ్రి మహేష్ భట్ బాలీవుడ్లో పేరెన్న దగ్గ దర్శక నిర్మాత అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు అలియా భట్ నటనతో పాటు స్వంత నిర్మాణ సంస్థను ప్రారంభించనుంది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. “నేను ముంబైలో నా నిర్మాణ సంస్థ కోసం ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నాను. ఎటర్నెల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించబోతున్నాను. దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి? ఏం చేయాలి? అనే దానిపై చర్చిస్తున్నాం. తర్వలోనే వివరాలను తెలియజేస్తాను. నేను ఎలాంటి సినిమాలనైతే చూడాలనుకుంటున్నానో.. అలాంటి సినిమాలను నా నిర్మాణ సంస్థలో చేయబోతున్నాను“ అంటూ చెప్పుకొచ్చింది అలియా భట్.
previous post
next post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!