బాలీవుడ్ బ్యూటీ లలో ఒకరైన అలియాభట్, హ్యాండ్సమ్ హీరో రణబీర్ కపూర్ తో రిలేషన్ లో ఉన్నారన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉండగా, వీరి ప్రేమ ని రెండు కుటుంబాలు ఒప్పుకున్నాయి.
వీరిద్దరికీరహస్యంగా నిశ్చితార్థం కూడా అయిపోయిందని సినీ వర్గాల సమాచారం. బాలీవుడ్ లో బెస్ట్ కపుల్ అనగానే,ఈ జంట పేరు ముందుగా వినపడుతుంది. ఐతే గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో.. అలియాభట్ లివ్ ఇన్ రిలేషన్, పిల్లల గురించి ప్రస్థావన వచ్చినప్పుడు తన అభిప్రాయం చెప్పింది. తన మనసుకి ఇది కరెక్ట్ టైమ్ అనిపించిన వెంటనే పెళ్లి చేసుకుంటానని.. అప్పటి వరకు దాని జోలికి పోను అని చెప్పింది.
తన దృష్టిలో పెళ్లి అంటే.. పిల్లల కోసమేనట. అందుకే… తనకు పిల్లలు కావాలి అనిపించినవెంటనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పేసింది. ఓ వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండటానికే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. అంతే తప్ప.. తనకు లివ్ ఇన్ రిలేషన్ అంటే పెద్దగా ఇష్టం లేదని చెప్పింది.పెళ్లి చేసుకునే వరకు తాను ఎవరితో కలిసి జీవించనని కూడా చెప్పింది. అంటే.. పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి జీవించడం లాంటివి చేయనని చెప్పింది.
అలియా ఫస్ట్ క్రష్ షారూక్ ఖాన్ అని ఆ తర్వాత రణ బీర్ కపూర్ అని, తన కెరిర్ మొదట్లో నే చెప్పింది. రణ బీర్ తో ప్రేమ కన్నా ముందు అలియా .. సిద్ధార్థ్ ప్రేమ లో ఉంది. వీరిద్దరూ కలిసి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా లో నటించారు. ఆ సినిమా సమయంలో నే వీరు ప్రేమ లో పడ్డారు అని అంటారు.