Aliya: బాలీవుడ్ బెస్ట్ కపుల్ రణబీర్ అలియా భట్ పేరెంట్స్ అయిన సంగతి తెలిసింది. ఇటీవల ఆలియా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తాజాగా ఆలియా తన కూతురు పేరుని తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. ఆ పేరు ఎవరు పెట్టారు. ఎందుకు పెట్టారు. ఆ పేరుకు గల అర్థాలేంటో వివరించింది ఆలియా..!
తాజాగా ఆలియా షేర్ చేసిన ఫోటోలో చిన్నారి డ్రెస్ ఉన్న పోస్టర్ పై రాహ అనే పేరుతో ఉన్న ఫోటోను షేర్ చేసింది ఈ పిక్ లో ఆలియా రణబీర్ కూడా ఉన్నారు. ఉన్నాడు వీరిద్దరూ కెమెరాకు బ్యాక్ సైడ్ లో ఫోజులు ఇచ్చారు. అంతేకాదు వీరి ముఖాలు కూడా ఆ ఫోటోలో బ్లర్ గా కనిపించాలి. తమ కూతురు పేరు పెట్టింది పాప నాయనమ్మ అని తెలిపింది. పాపకి రాహా అనే పేరు చిన్నారి నాయనమ్మ రణబీర్ తల్లి అయినా నీతూ కపూర్ ఛాయిస్ అని తెలిపింది. అయితే మా కూతురు రాహ పేరుకు ఎన్నో అర్థాలు ఉన్నాయని అనేక భాషల్లో అనేక అర్థాలు ఉన్నాయని వివరించింది. రాహ అంటే పీస్ ఫుల్, హ్యాపీనెస్, ఫ్రీ బ్లెస్ ఇలా అనేక అర్థాలు ఉన్నాయని చెప్పింది. పాప కి పేరు పెట్టడానికి ఆలియా ఇంతలా క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఇంతకుముందు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలే ప్రభావమే దీనికి కారణం అనిపిస్తుంది.
ఆలియా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆలియా ప్రెగ్నెన్సీ సమయంలో కూడా సినిమాల్లో షూటింగ్లో పాల్గొంటూ సందడి చేసింది. బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో కూడా బేబీ పంపుతో కనిపించింది. బ్రహ్మాస్త్ర సినిమాలో అలియా భట్ రణబీర్ కపూర్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన మెప్పించింది.