Categories: సినిమా

Aliyabat: పెళ్లై 3 నెలలు తిరక్కుండానే తల్లి కాబోతున్న అలియాభట్?

Share

Aliyabat: అలియాభట్… ఈ పేరుని పరిచయం అవసరం లేదేమో. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్, నటి సోని రజ్దాన్ కుమార్తె అయినటువంటి అలియా తనకంటూ ఓ గుర్తింపు రావడంకోసం అహర్నిశలు శ్రమించింది. ఈమెకు షహీన్ భట్ అనే ఒక సోదరి కలదు. ప్రముఖ నటి పూజా భట్, రాహుల్ భట్ ఈమె సవతి సోదరీ సోదరులు అన్న విషయం విదితమే. ముంబైలోని జమ్నాబాయ్ పాఠశాలలో విద్యను పూర్తి చేసింది. ప్రస్తుతం బాలీవుడ్లో మంచి క్రేజ్ వున్న హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన మల్టీస్టారర్ ‘RRR’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే.

Aliyabat: గంగూభాయ్ తల్లి కాబోతోంది!

ఆమధ్య సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘గంగూభాయ్’ చిత్రంలో గంగూభాయ్ పాత్రను పోషించిన అలియా పూర్తిగా దానికి న్యాయం చేకూర్చింది. అందుకుగాను విమర్శకుల ప్రశంసలు ఆమెకు దక్కాయి. మరెవ్వరూ ఆ పాత్రను చేయలేరేమో అన్నంతగా అలియా నటించి మెప్పించింది. ఇక కొంతకాలంగా ప్రేమలో వున్న హీరో రణ్ బీర్ కపూర్, అలియా ముందు నెలల క్రితం వివాహంతో ఒక్కటయ్యారు. ఇదిలా వుంటే సోమవారం అలియా భట్ సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా పెట్టిన పోస్ట్ ఫొటోలు ఆమె అభిమానుల్ని షాక్ కు గురిచేశాయి. అలియా సోమవారం షాకింగ్ స్యూస్ ని వెల్లడించి అందరిని విస్మయానికి గురిచేసింది.

ఎర్లీ ప్రెగ్నేన్సీ:

ఇంతకీ విషయం ఏమంటే, తాను తల్లిని కాబోతున్న విషయం తన అభిమానులకు షేర్ చేసింది. త్వరలోనే మా బేబీ వస్తోందంటూ తను షేర్ చేసిన ఫొటోకు క్యాప్షన్ ఇచ్చి తన ప్రెగ్నేన్సీ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయమై హాస్పిటల్ బెడ్ పై పడుకుని కంప్యూటర్ స్క్రీన్ పై తన గర్భాన్ని చూసుకుంటూ అలియా కనిపించింది. పక్కనే రణ్ బీర్ టోపీ ధరించి కనిపించాడు. అలియా భట్ స్వయంగా షేర్ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే పెళ్ళై పట్టుమని మూడు నెలలు కాకుండానే వచ్చిన ప్రెగ్నేన్సీ విషయాన్ని తెలిసి అభిమానులు ఖంగు తింటున్నారు.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

2 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

2 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

3 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

3 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

5 hours ago