Naandhi Movie : అల్లరి నరేష్ కామెడీ సినిమాల ద్వారా అందరిని నవ్వించి అందరి ప్రశంసలను పొందాడు. అయితే కొద్దికాలం నుంచి అల్లరి నరేష్ కామెడీ సినిమాలు భారీ ఫ్లాప్ లను చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్న అల్లరి నరేష్ తాజాగా “బంగారు బుల్లోడు”చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. అయితే అన్ని సినిమాలు మాదిరిగానే ఈ సినిమా కూడా అల్లరి నరేష్ కి నిరాశనే మిగిల్చింది. అసలు ఈ సినిమా ఎప్పుడు విడుదల అయిందనే విషయం కూడా తెలియడం లేదు. ఈ సినిమా అనంతరం అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం”నాంది”.ఈ సినిమాపై అల్లరి నరేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రెయిలర్ విడుదలై అందరిని ఆకట్టుకుంది.
ఇప్పటి వరకు అల్లరి నరేష్ నటించిన సినిమాలన్నీ అందరూ నవ్వుకునే విధంగా ఎంతో కామెడి తరహాలో తెరకెక్కాయి. కానీ నవ్వించే వాళ్ళు ఏడిపిస్తే ఎంతో బాగుంటుందని చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే అల్లరి నరేష్ నాంది చిత్రంలో భిన్నంగా ఇంటెన్స్ క్రైమ్ డ్రామాలో నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు కూడా కొన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రెయిలర్ లో కూడా అల్లరి నరేష్ కొత్తగా కనిపిస్తున్నాడు.
చేయరాని నేరానికి అమాయకుడు జైలుకు వెళితే అతడికి వ్యతిరేకంగా సాక్ష్యాలను సృష్టించి అతని మరిన్ని సమస్యల సుడిగుండంలోకి తోసేస్తే వాటన్నిటినీ తట్టుకొని ఎలా బయటకు వచ్చాడనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమానే “నాంది”. ఎప్పుడు నవ్వుల పువ్వులు పూయించి నరేష్ ఈసారి ఈ సినిమాలో ఎంతో సీరియస్ పాత్రలో నటించి భిన్నంగా కనిపించనున్నాడు. అయితే ఈ పాత్రలో కనిపించడం అల్లరినరేష్ కొత్త అయినప్పటికీ ఈ సినిమాలో ఉన్నటువంటి కథాంశంతో ఇదివరకు ఇలాంటి ఎన్నో సినిమాలు వచ్చాయి. “నాంది”
ట్రెయిలర్ చూడగానే ఈ కథ మొదటి నుంచి చివరి వరకు ఒక అంచనా వేయవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ అందరిని ఆకట్టుకున్నప్పటికీ రొటీన్ కథాంశంతోనే తెరకెక్కడమే ఈ సినిమాకు నెగిటివ్ అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాపై అల్లరినరేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు.ఈ సినిమా అల్లరి నరేష్ ఆశలను అడియాశలు చేస్తాయా లేక అతనికి ఒక మంచి విజయం అందిస్తాయ అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు పాటు వేచి ఉండాల్సిందే.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!