ఎన్టీఆర్ ‘కొమరం భీమ్’ టీజర్ పై భారీ ఎత్తున విమర్శలు..! జక్కన్న కాపీ కొట్టాడట

తెలుగు చలనచిత్రం స్థాయిని అమాంతం పెంచేసిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కి ఇప్పటివరకు అపజయం అన్నదే లేదు. బాహుబలి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తెరకెక్కిస్తున్నఆర్ ఆర్ ఆర్‘ (రౌద్రం రణం రుధిరం) సినిమా కొత్త అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

 

కొమరం భీమ్ దంచేశాడు….

వివరాల్లోకి వెళితే ఈ రోజు ఉదయం విడుదలైన ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక టీజర్ కి సంబంధించి రాజమౌళి పై అనేక విమర్శలు వచ్చాయి. రామరాజు.. మా తమ్ముడు కొమరం భీమ్ అని నందమూరి తారక రామారావు జూనియర్ ని కొమరం భీమ్ పాత్ర లో పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియో లో కొన్ని షాట్స్ వేరే చోట నుండి కాపీ చేశారట. ఇప్పటికే రామ్ చరణ్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చి అల్లూరి సీతారామరాజు గా పరిచయం చేసిన వీడియో రికార్డు సృష్టించింది. అయితే టేకింగ్ పరంగా ఎన్టీఆర్ వీడియో కూడా ఒక రేంజ్ లో ఉంది అనే చెప్పాలి.

కాపీ అంటున్న షాట్స్ ఇవే

ఇక విషయానికి వస్తే ఈ టీజర్ లో ఎన్టీఆర్ కంటి దగ్గర నుండి రక్తపు చుక్క నేల పై పడుతుంది అప్పుడు ఒక అగ్ని పర్వతం బద్దలు అయ్యినట్టు విస్ఫోటనం చెందే షాట్, అడవిని సుందరంగా చూపించే మరొక షాట్, వాన చినుకులు నెలకు తగిలినప్పుడు ఉవ్వెత్తున ఎగిసే షార్ట్ అలాంటి కొన్ని షాట్లను వేర్వేరు వెబ్ సైట్, యూట్యూబ్ వీడియోలు నుండి తీసుకొని వచ్చి టీజర్ లో జత చేశారు అని స్క్రీన్షాట్స్ షేర్ చేశారు.

అందుకే ఇలా చేశారా?

ఈ మధ్య కాలంలో లాక్ డౌన్ సమయం నుండి ప్రతి దర్శకుడు తీసిన సినిమాలోని సన్నివేశాలు వేరే ఇతర సినిమాలోని సన్నివేశాలతో కొద్దిగా పోలిక ఉన్నా అతడి కాపీ చేశాడని అనేస్తున్నారు. లాక్ డౌన్ లో అయితే త్రివిక్రమ్ సినిమాలపై ఇలాంటి ట్రోల్స్ బాగా వచ్చాయి. రాజమౌళి అభిమానులు మాత్రం జక్కన్న ను వెనకేసుకొని వస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా చాలా విజువల్స్ షూట్ చేయలేదని…. రామ్ చరణ్ వీడియో కి ఉన్న హైప్ ను అలాగే కొనసాగించేందుకు ఎన్టీఆర్ వీడియో లో ఇటువంటి షాట్స్ పెట్టాల్సి వచ్చిందని చెబుతున్నారు.

కేవలం ప్రకృతిని సుందరం గా చూపించడానికే తప్పించి ఏ సన్నివేశం కానీ ఎన్టీఆర్ గెటప్ కానీ కాపీ లేవు కదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ నుండి అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.