Allu Arjun -Mahesh Babu: ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరూ కేవలం సినిమాలపై మాత్రమే ఆసక్తి చూపకుండా, థియేటర్ బిజినెస్ పై కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వారు ఎక్కడైతే సంపాదిస్తున్నారో అక్కడే పెట్టుబడులు పెట్టడానికి హీరోలందరూ ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ విధమైన బిజినెస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆరితేరారని చెప్పవచ్చు. మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఏషియన్ సినిమాస్‌తో కలిసి మల్టీప్టెక్స్ మొదలు పెట్టాడు. AMB సినిమాస్ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్సులలో ఒకటిగా నిలిచింది.
మహేష్ అడుగుజాడల్లోనే యువ హీరో, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ సినిమాస్ పార్ట్నర్ షిప్‌తో మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నాడు. AVD సినిమాస్ పేరుతో తన సొంత పట్టణం మహబూబ్ నగర్ లో ప్రారంభించబోతున్నారు.అదే విధంగా పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సీనియర్ హీరో వెంకటేష్ లాంటి హీరోలు కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లు చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ నెల్లూరులో ఒక మల్టీప్లెక్స్ ఓపెన్ చేశారు.
అల్లు అర్జున్ AAA:
స్టార్ హీరోలందరూ మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తుండగా తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ బిజినెస్ రంగంలోకి దిగారు. ఇప్పటికే స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఏషియన్ సినిమాస్‌తో కలిసి AAA సినిమాస్ మొదలు పెడుతున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ఓపెన్ కానుందని తెలుస్తోంది.అమీర్ పేట్ సత్యం థియేటర్ స్థలంలోనే ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది.ఈ మల్టీ ప్లెక్స్ కోసం పూర్తిగా అల్లు అర్జున్ ఇమేజ్ వాడుకోవడమే కాకుండా ఆయన ఫోటో ఉన్నటువంటి లోగోను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ లోగో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ మల్టీ కాంప్లెక్స్ మరో ఆరు నెలలో ఓపెన్ కానుందని తెలుస్తోంది. అమీర్ పేట్ పరిసర ప్రాంతాలలోనే అత్యంత విలాసవంతమైన భవంతి నిర్మిస్తున్నారని తెలుస్తోంది. అల్లుఅర్జున్ నిర్మిస్తున్న AAA,మహేష్ బాబు AMB సినిమాస్ ను మించిపోయేలా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ బాబు “సర్కారీ వారి పాట” చిత్రంలో నటించగా, అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా తరహాలోనే తెరకెక్కుతున్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!