‘అల..వైకుంఠపురములో..’ సాంగ్‌ టీజర్‌

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అలియాస్‌ బన్నీ దాదాపు ఏడాది గ్యాప్‌ తర్వాత నటిస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంటే టబు కీలక పాత్రలోనటిస్తుంది. తమన్‌ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో రెండు సాంగ్‌ టీజర్‌ను నేడు విడుదల చేశారు. రాములో రాములా నన్నాగం చేసిందిరో.. అంటూ మాస్‌ కోణంలో సాగే పాట ఇది. అనురాగ్‌ కులకర్ణి, మంగ్లీ పాడిన ఈ పాటను కాసర్లశ్యామ్‌ రాశారు. పూర్తి సాంగ్‌ను ఈ నెల 26న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘సామజవరగమన&’ సాంగ్‌ సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంది. తెలుగు సినిమా పాటల్లోనే సరికొత్త రికార్డును ఇది క్రియేట్‌ చేసింది. మరి 26న విడుదల కాబోతున్న ‘రాములో రాములా..’ ఎలాంటి మేజిక్‌ క్రియేట్‌ చేయనుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.
జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రం కాబట్టి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తున్నారు.