న్యూస్ సినిమా

Allu arjun – Prabhas: అల్లు అర్జున్‌కి ఇక అక్కడ తిరుగు లేదు..ఏకంగా ప్రభాస్‌నే దాటేశాడు

Share

Allu arjun – Prabhas: అల్లు అర్జున్‌కి ఇక అక్కడ తిరుగు లేదు..ఏకంగా ప్రభాస్‌నే దాటేశాడు అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసేస్తున్నారు. బాహుబలి సిరీస్‌లో వచ్చిన 2వ భాగం బాహుబలి ది కన్‌క్లూజన్ రికార్డ్స్ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ బ్రేక్ చేసేశాడని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోయిన ఏడాది డిసెంబర్ 17వ తేదీన సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ పాన్ ఇండియన్ సినిమా పుష్ప:ది రైజ్ పార్ట్ 1. ఈ సినిమాకు అన్నీ భాషలకంటే అతి తక్కువగా పబ్లిసిటీ చేసింది బాలీవుడ్‌లోనే.

allu-arjun-beats prabhas with pushpa part 1
allu-arjun-beats prabhas with pushpa part 1

కానీ, అక్కడే ఈ సినిమా రూ.100 కోట్ల మార్క్ చేరువలో ఉంది. ‘పుష్ప’ పార్ట్-1 మూవీకి నార్త్ సినిమా ఇండస్ట్రీలో సరైన ప్రమోషన్లు చేయకపోవడం వల్లనే మొదటి రోజు దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసింది. లేదంటే దీనికి మూడు రెట్లు వసూళ్ళు రాబట్టేదని అప్పుడు టాక్ వినిపించింది. అయితే, నార్త్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పుష్ప పార్ట్ 1 సినిమా మూడు వారాల తర్వాత కూడా మొదటి రోజు కంటే మించి వసూళ్లు రాబట్టడం ఆసక్తికరమైన విషయం. హాలీవుడ్ సినిమా ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ బాలీవుడ్ సినిమా ’83’ లాంటి రెండు క్రేజీ చిత్రాలతో పోటీ పడి ‘పుష్ప: ది రైజ్’ మూవీ ఈ రేంజ్ వసూళ్ళు రాబట్టడం గొప్ప విషయం.

Allu arjun – Prabhas: ‘పుష్ప’ 6 వ వారం వసూళ్ళలో ‘బాహుబలి: ది కన్క్లూజన్’ ని క్రాస్..

పుష్ప పార్ట్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు సోషల్ మీడియాలోనూ సంచలనం సృష్ఠించాడు. పుష్ప సిగ్నేచర్ స్టెప్ అలాగే, ఈ సినిమా పాటలు ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఎంతగానో ఆకర్షించాయి. ఈ క్రమంలో ఇప్పుడు నార్త్ మార్కెట్‌లో 6వ వారంలోనూ ‘పుష్ప-1’ మంచి వసూళ్ళు రాబడుతోంది. ఈ సినిమా 6వ వారంలో రూ. 6 కోట్లు రాబట్టి ‘ఊరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ చిత్రాల తర్వాత ఆల్ టైమ్ 3వ అత్యధిక ఆరవ వారం నెట్ గ్రాసర్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ‘పుష్ప’ 6 వ వారం వసూళ్ళలో ప్రభాస్ నటించిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ (5.40 కోట్లు) ని క్రాస్ చేసి మూడవ స్థానంలో నిలిచి హాట్ టాపిక్‌గా మారింది.


Share

Related posts

Salaar Movie: “సలార్” లో ప్రభాస్ ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో తెలుసా? బాహుబలి ఏం పనికొస్తుంది దీని ముందు?

sekhar

Elon Musk: డెమొక్రటిక్ పార్టీపై సంచలన కామెంట్స్ చేసిన ఎలాన్ మస్క్

somaraju sharma

Vijay Devarakonda: పేరు మార్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. హ‌ర్ట్ అవుతున్న మ‌హేష్ ఫ్యాన్స్‌!

kavya N
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar