Samantha: ఊ.. అంటావా సాంగ్ షూటింగ్ కి ముందు రోజు బన్నీ ఫోన్ చేశాడు ‘ అసలు మ్యాటర్ బయటపెట్టిన సమంత..!

samantha
Share

Samantha:ఎవరి నోట విన్నాగాని పుష్ప సినిమాలోని పాటలు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా రారా స్వామి పాట అయితే మంచి ట్రేండ్ అయింది. విదేశీయులు సైతం ఈ పాటకు స్టెప్స్ వేసి మరి ఆదరగోడుతున్నారు. అలాగే పుష్ప సినిమాలోనీ ఊ అంటావా.. మావ ఉహు అంటావా.. అనే స్పెషల్ సాంగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్నపిల్లాడి దగ్గర నుండి పెద్దల వరకు ప్రస్తుతం అందరి నోట ఇదే పాట. అలాగే ఈ పాటకు అంత క్రెజ్ రావడానికి సమంత మరో కారణం అని అనడంలో అతిశయోక్తి లేదు. సమంత పెర్ఫార్మన్స్ మాములుగా లేదు ఈ పాటలో.
samantha

Samantha: పుష్ప సినిమాలోని స్పెషల్ పాటకు ఒక ఊపు ఊపిన సామ్ :

ఒక రేంజ్ లో అందాల ప్రదర్శనతో పాటు హావభావాలు కూడా ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పుష్ప సినిమా విడుదలై మూడు వారలు అవుతున్నాగాని సినిమా కలెక్షన్లు మాత్రం ఇప్పటికి తగ్గలేదు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. అల్లు అర్జున్‌, రష్మిక హీరో హీరోయిన్స్ గా నటించిన పుష్ప సినిమాలో సామ్ ఒక ప్రత్యేక గీతంలో నటించింది.

ఎన్ని వివాదాలు వచ్చిన ట్రేండింగ్ గా మారిన సామ్ సాంగ్ :

ఇదిలా ఉండగా పుష్పలో సమంత చేసిన స్పెషల్‌ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్‌ వచ్చింది. ఈ పాటలో సామ్ నటిస్తుందని తెలియగానే అందరు షాక్ అయ్యారు. సమంత ఐటమ్ సాంగ్ చేయడం ఏంటని పలువురు విమర్శలు కూడా చేసారు. అలాగే ఈ పాట లిరిక్స్ కూడా మగవాళ్ల మనోభావాలు దెబ్బతినెలా ఉన్నాయని పురుష సంఘాల నుంచి అభ్యంతరాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఎన్ని వివాదాలు వచ్చినాగాని ఈ పాటకు యూట్యూబ్‌ లో రికార్డు స్థాయిలో వ్యూస్‌ వచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు సమంత పుష్పలో ఈ సాంగ్‌ చేయడానికి ఎవరు తనని ప్రోత్సహించారో అనే విషయం రివీల్ చేసింది. నిజానికి ఈ పాటలో నటించడానికి సామ్ మొదట ఒప్పుకోలేదని, తనని ఎలాగోలా ఒప్పించామని పుష్ప డైరెక్టర్‌ సుకుమార్‌, హీరో అల్లు అర్జున్‌ చెప్పుకొచ్చారు.

సమంత స్పెషల్ సాంగ్ చేయడానికి గల కారణం ఎవరంటే..?

తాజాగా ఈ విషయంపై సమంత ఒక ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ విధంగా స్పందించింది. సమంత పుష్ప సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేయడానికి ముఖ్య కారణం అల్లు అర్జున్‌ అంటూ చెప్పింది. నిజానికి ఈ ‘స్పెషల్‌ సాంగ్ చేయడానికి సమంత చాలా బయపడిందని, అసలు ఒకానొక సందర్బంలో ఈ సాంగ్ చేయాలా..? వద్దా..? అనే సందిగ్ధంలో ఉండిపోయనని చెప్పింది. ఎటూ తేల్చుకొని అయోమయంలో ఉన్నప్పుడు అల్లు అర్జున్ నాలో స్ఫూర్తిని నింపాడని చెప్పింది సామ్. ఆ పాటలో నటిస్తే ఎంత పాపులారిటీ వస్తుందో అనే విషయాన్నీ కూర్చోబెట్టి మరి వివరించాడని, అల్లు అర్జున్ మాటలు విన్నాక పాటలో నటించడానికి ఒకే చెప్పేశా’ అంటూ చెప్పుకొచ్చింది సమంత. బన్నీ కనుక నాకు వివరించి చెప్పకపోతే అసలు ఆ పాటలో నటించేదాన్ని కాదని చెప్పింది సామ్‌. అల్లు అర్జున్ తో సమంత ఇంతముందే సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన విషయం అందరికి తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు బన్నీ సరసన ఈ పాటలో నటించి అందరి చేత శబాష్ అనిపించుకుంది.


Share

Related posts

Anushka shetty: అనుష్క శెట్టికి అవకాశాలు ఇవ్వడం లేదా..సైజ్ జీరో కోసం చేసిన రిస్క్ ఆమె లైఫ్‌నే తలకిందులు చేసిందా..?

GRK

ప్ర‌ధాని కోసం ….9 లుక్స్‌

Siva Prasad

‘కళా’త్మక దర్శకుడు ‘కన్ను’ మూత

Siva Prasad