Allu Arjun: 2021 ఏడాదికి గాను ఉత్తమ జాతీయ నటుడు అవార్డు “పుష్ప” సినిమాకి అల్లు అర్జున్ అందుకోవటం జరిగింది. నేడు ఢిల్లీలో జరిగిన 69వ చలనచిత్ర అవార్డుల ప్రధాన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగు చలనచిత్ర రంగంలో మొట్టమొదటి ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించారు. ఇదిలా ఉంటే అవార్డు అందుకున్న అనంతరం “పుష్ప” సినిమా డైరెక్టర్ సుకుమార్ పై అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎమోషనల్ కామెంట్ చేయడం జరిగింది.
జాతీయ అవార్డు అందుకోవటం ఎంతగానో గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డుతో నన్ను గుర్తించినందుకు కేంద్ర మంత్రిత్వ శాఖకు జాతీయ అవార్డుల జ్యూరీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవార్డు ఓ వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు సినిమాను ఆదరించి మరియు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ఇది చెందుతుంది. థాంక్యూ సుకుమార్ గారు నేను ఈ ఘనత సాధించడానికి ప్రధాన కారణం మీరే అంటూ.. అల్లు అర్జున్ తన స్పందన తెలియజేశారు. 2021 డిసెంబర్ నెలలో విడుదలైన పుష్ప పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
ఈ సినిమాలో ప్రతి డైలాగ్ మరియు పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా “పుష్ప” క్యారెక్టర్ మేనరిజమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా తగ్గేదేలే డైలాగ్.. ఇప్పటికి కూడా ట్రెండ్ సెట్టర్ గా ఉంది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా కి ఉత్తమ జాతీయ నటుడు అవార్డుతో పాటు.. ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ కి కూడా అవార్డు లభించింది. మొత్తం “పుష్ప”కి 2 జాతీయ అవార్డులు వరించాయి. దీంతో “పుష్ప” సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. జాతీయ అవార్డులు రావడం పట్ల “పుష్ప” నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఆనందం వ్యక్తం చేయడం జరిగింది.