Mega War: 2016 సంవత్సరంలో కుర్ర హీరో నాగశౌర్య మెగా డాటర్ నిహారిక నటించిన ఒక మనసు మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు బన్నీ రావడం తెలిసిందే. ఆ సమయంలో కొంత మంది ఫ్యాన్స్ పవర్ స్టార్ పవర్ స్టార్ అని కేకలు వేస్తుంటే బన్నీ… “చెప్పను బ్రదర్” అని అనటంతో అప్పటినుండి మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్ వార్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. చాలా సందర్భాలలో బన్నీని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో.. నెగిటివ్ కామెంట్లు చేయడం జరిగింది.
దీంతో బన్నీని ప్రత్యేకంగా అభిమానించే ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో.. తమ అభిమాన హీరో కి అండగా వస్తూ ఉన్నారు. సోషల్ మీడియా లో ఎటువంటి గొడవ అయినా గాని తిప్పికొడుతూ… బన్నీ భుజం కాస్తున్నారు. వరుస విజయాలతో మంచి జోరుమీద ఉన్న అల్లు అర్జున్ “పుష్ప” సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో.. ఓరేంజ్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం తెలిసిందే. ఇటువంటి తరుణంలో ఇటీవల పవన్ ని ముఖ్యమంత్రి చేసే దిశగా.. రాజకీయంగా విజయవాడ అ నగరంలో మెగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది.
ఈ వేడుకలో మెగా కుటుంబానికి చెందిన హీరోల ఫోటోలు ఉన్నాయి గాని నీ ఫోటో మాత్రం ఎక్కడ లేదు. పైగా బన్నీ ప్రస్తావన కూడా ఈ కార్యక్రమంలో తీసుకురాలేదని టాక్. దీంతో కొంతమంది మెగా హీరోలను సపోర్ట్ చేసే ఫ్యాన్స్.. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బన్నీ పై సోషల్ మీడియాలో కొంత నెగిటివ్ కామెంట్ చేయటం తో బన్నీ ఫ్యాన్స్.. తమదైన శైలిలో ఎటాక్ చేస్తూ ఉన్నారు. “ఏం పీకలేరు” అనే హాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ చేస్తున్నారు. మొత్తం మీద సోషల్ మీడియాలో మెగావార్ ఓ రేంజ్ లో కొనసాగుతోంది.
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…
Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…