సినిమా

Prabhas Bunny: ‘ఒకే ఒక్క’ కారణం దొరికింది .. ప్రభాస్ ని భయంకరంగా ట్రోల్ చేస్తోన్న అల్లూ అర్జున్ ఫ్యాన్స్ !

Share

Prabhas Bunny: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ బన్నీ ల మధ్య మంచి స్నేహం ఉందన్న సంగతి తెలిసిందే. చాలా ప్యూర్ హార్ట్ పర్సన్ ప్రభాస్ అని చాలా సందర్భాలలో బన్నీ మీడియా ముందే పొగిడిన సందర్భాలు ఉన్నాయి. ఇదే తరుణంలో ప్రభాస్ “బాహుబలి” సినిమా హిట్టయినా సమయంలో కూడా బన్నీ.. ప్రభాస్ గొప్పదనం గురించి యాక్టింగ్ గురించి ప్రశంసించాడు. ఇక ఇదే సమయంలో ప్రభాస్ కూడా బన్నీ యాక్టింగ్ గురించి డాన్స్ గురించి.. ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి.

Prabhas on 2 years of Baahubali 2: It is an iconic benchmark in my life - Movies Newsప్రభాస్- బన్నీ తీరు ఇలా ఉంటే మరో పక్క ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో భారీ వార్ కొనసాగుతోంది. ఇటీవల బన్నీ నటించిన “పుష్ప” సినిమా హిందీ లో రిలీజ్ అయ్యి.. అక్కడి స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా కలెక్షన్లను సాధించడంతో బన్నీ ఫాన్స్ రెచ్చిపోతున్నారు. ప్రభాస్ నీ లాటరీ స్టార్ట్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. రాజమౌళి దయతో బాహుబలి తో ప్రభాస్ అదృష్టవంతుడు అయ్యాడని అంటున్నారు. యాక్టింగ్ పరంగా డాన్స్ పరంగా ప్రభాస్ కంటే బన్నీ ఆల్రౌండర్ అని చెప్పుకొస్తున్నారు.

Pushpa (Hindi) Box Office Update: Allu Arjun Starrer Is The Lone Warrior In Its 6th Weekబాహుబలికి ముందు ఉత్తర భారతదేశంలో ప్రభాస్ కు ఎటువంటి గుర్తింపు లేదని జాక్ పాట్ కొట్టి అకస్మాత్తుగా పాన్ ఇండియా స్టార్ డమ్ ను పొందాడని.. అందుకు రాజమౌళికి ధన్యవాదాలు అని బన్ని ఫ్యాన్స్ అంటున్నారు. మరోపక్క బన్నీ ఫాన్స్ ట్రోలింగ్ కి దీటుగా ప్రభాస్ అభిమానులు కూడా రియాక్ట్ అవుతున్నారు. బాహుబలి సినిమా తో ప్రపంచస్థాయిలో టాలీవుడ్ ఇండస్ట్రీకి రాజమౌళి-ప్రభాస్ గుర్తింపు తెచ్చారని చెప్పుకొచ్చారు. నిజంగా ప్రభాస్ లాటరీ స్టార్ట్ అయితే.. సాహో సినిమా ఫ్లాపయితే అంత కలెక్షన్ ఎలా రాబడుతుందని ప్రశ్నించారు. అల్లు అర్జున్ హిందీ సినిమా లైఫ్ టైం కలెక్షన్లు… ప్రభాస్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ లతో సమానం అంటూ.. ఘాటుగా ప్రభాస్ అభిమానులు కూడా బన్నీ ఫ్యాన్స్ కి కౌంటర్ లు వేస్తున్నారు. ఇద్దరు హీరోలు మధ్య మంచి స్నేహం ఉన్నాగాని అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.


Share

Related posts

Sakshi Agarwal Latest Gallerys

Gallery Desk

కొత్త కామెడీ షో లో బూతుల పర్వం..! నాగబాబు పక్కనే నిహారిక, శ్రీ ముఖి

arun kanna

RC15: RC15..సినిమా యూనిట్ కి వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్..దిల్ రాజు??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar