Pushpa: ఐకాన్ స్టార్ బన్నీ నటించిన పుష్ప ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం… విడుదలైన ప్రతి చోట పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టింది. ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కడ స్టార్ హీరోలకు దీటుగా 100 కోట్లు కొల్లగొట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కనీసం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేయకుండా పుష్ప బాలీవుడ్ లో… సత్తా చాటడం బయ్యర్లకు షాక్ ఇచ్చినట్లు అయింది.
ఇక ఇదే సమయంలో “బాహుబలి” తరహాలో పుష్ప మరోసారి తెలుగు సినిమా సత్తా ఏంటో నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో రుజువు చేయడం జరిగింది. సినిమాలో సాంగ్స్ మరియు డైలాగులు… తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాక ఇతర భాషలకు చెందిన వాళ్లకి.. ఇతర దేశస్థులకు కూడా నచ్చడం విశేషం. తగ్గేదేలే… డైలాగ్, శ్రీవల్లి పాటకి బన్నీ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుకూన్నాయి. ఇటువంటి నేపథ్యంలో పుష్ప సెకండ్ పార్ట్ పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
కాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఏప్రిల్ నుండి స్టార్ట్ అయి… డిసెంబర్ కల్లా పూర్తి చేసే ఆలోచనలో బండి ఉన్నారంట. కానీ ఈ సినిమాను మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ లోనే రిలీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారట. దాదాపు మూడు నెలలు సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు… చేపట్టాలని సినిమా షూటింగ్ కంటే ఎక్కువగా ప్రమోషన్ కార్యక్రమాలకు.. బాగా ఫోకస్ పెట్టాలని సినిమా నిర్మాతలకు అదేవిధంగా డైరెక్టర్ కి బన్నీ ముందుగా కీలక ఆదేశాలు ఇచ్చినట్లు ఇటీవల ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాతో మరోసారి బాలీవుడ్ లో తిరుగులేని మార్కెట్ సొంతం చేసుకోవాలని… బన్నీ ప్లానింగ్ అన్నట్లూ టాక్.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!