Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “మంగళవారం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. “RX 100” సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ సినిమా వచ్చే శుక్రవారం థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అజయ్ ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇందులో చాలా బోల్డ్ ఇష్యూ ఉంటాది. ఇలాంటి సినిమా చేయాలంటే చాలా ధైర్యం కావాలి. మంగళవారం టీజర్ చూసిన వెంటనే సినిమా చూడాలనిపించింది. టీజర్ సుకుమార్ గారు కూడా చూసి చాలా బాగుంది అన్నారు.
నాకు అజయ్ దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా అంటే చాలా ఇష్టం. ఆయన గొప్ప టెక్నీషియన్ మరియు దర్శకుడు. జీవితంలో కొంతమంది మాత్రమే స్నేహితులవుతారు. వాళ్లు మన విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు స్వాతి, ప్రణవ్ లు అలాంటి వాళ్లే. వాళ్లకి ఇది ఫస్ట్ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అటువంటి వాళ్లకోసం వచ్చి సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇదే సమయంలో “పుష్ప 2” గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుగుతుందని తెలిపారు.
సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ లో ఉన్న గెటప్ లో ప్రస్తుతం జాతర ఎపిసోడ్ షూట్ చేస్తున్నట్లు తెలిపారు. అందువల్ల చేతికి పారాణి నైల్ పాలిష్ ఉందని చెప్పుకొచ్చారు. ఆ జాతర ఎపిసోడ్ ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న సినిమా విడుదల కాబోతుంది. దాని గురించి వేరే ఈవెంట్ లో మాట్లాడుకోవచ్చు అని బన్నీ తెలిపారు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్..నీ చాలా వైవిధ్యంగా చూపించడం జరిగింది. హర్రర్ నేపథ్యంలో మంగళవారం సినిమా తీసినట్లు టీజర్ బట్టి తెలుస్తోంది.
NIHARIKA: కొణిదెల నిహారికేంటి పోసానిని అంతమాట అనేసింది..బాబాయ్ ని అంటే ఊరుకుంటుందా మరి