Allu arjun: అల్లు అర్జున్ ఐకాన్ మూవీ చేస్తారని గతకొన్ని నెలలుగా ప్రచారం జరుగు తూనే ఉంది. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో పట్టాలెక్కాల్సింది. కానీ, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా చేసి ఫ్లాప్ చూడటంతో ఈ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టారు బన్నీ. అల వైకుంఠపురములో సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత ఐకాన్ చేస్తారని వార్తలు వచ్చాయి. చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా ఈ విషయాన్ని
వెల్లడించారు. కనబడుట లేదు అనే ట్యాగ్ లైన్‌తో టైటిల్ పోస్టర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. దర్శకుడిగా వేణు శ్రీరామ్ ఫిక్సైయ్యాడు.
అయితే, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో బిజీ కావడంతో వేణు శ్రీరామ్ కి ఏకంగా పవన్ కళ్యాణ్‌తో అదే దిల్ రాజు నిర్మాణంలో వకీల్ సాబ్ సినిమాను తీసే అవకాశం అందుకున్నాడు. వకీల్ సాబ్ భారీ సక్సెస్ అయ్యేసరికి మళ్ళీ అల్లు అర్జున్ ఐకాన్ సినిమాను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వార్తలు వచ్చాయి. సుకుమార్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ సినిమాను చేస్తున అల్లు అర్జున్..ఐకాన్ సినిమా కథను కూడా దానికి తగ్గట్టే మార్పులు చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. కట్ చేస్తే అల్లు అర్జ్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారడమే కాదు పాన్ ఇండియన్ స్టార్‌గా కూడా
మారారు.
Allu arjun: ‘ఐకాన్’ కూడా చేసేందుకు రామ్ కమిటయ్యాడట..?
దాంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి అల్లు అర్జున్ తప్పుకున్నట్టు సమాచారం. అందుకే ఇప్పుడు ఐకాన్ సినిమా కథను ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం రామ్ తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో ది వారియర్ అనే ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఇక ఇటీవలే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ సినిమా అధికారికంగా ప్రకటన కూడా వచ్చిద్ని. ఇప్పుడు ఈ క్రమంలోనే ఐకాన్ కూడా చేసేందుకు రామ్ కమిటయ్యాడట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు గాని ఈ వార్త మాత్రం ఇప్పుడు సోషల్
మీడియాలో బాగా వైరల్ అవుతోంది.