Prabhas – Allu arjun: ప్రభాస్‌ను దాటుకొని నంబర్ 1 ప్లేస్‌లో అల్లు అర్జున్..ఇది ఎవరూ ఊహించనిది..

Share

Prabhas – Allu arjun: ప్రభాస్‌ను దాటుకొని నంబర్ 1 ప్లేస్‌లో అల్లు అర్జున్..ఇది ఎవరూ ఊహించనిది..అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు అంతటా ప్రచారం చేస్తున్నారట. ఇందులో నిజం కూడా ఉంది. అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ స్టార్‌గా టాలీవుడ్, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో మాత్రమే కాకుండా సౌత్‌లోనూ ప్రభాస్ క్రేజ్ అండ్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. అయితే ప్రభాస్ వరుసగా సినిమాలను రిలీజ్ చేయలేకపోవడం కొంత మైనస్ అవుతోంది. ఇప్పటికే తన మార్కెట్‌ను టార్గెట్ చేశారు దాదాపు అందరు హీరోలు.

allu-arjun-in number one place
allu-arjun-in number one place

ఆ మార్కెట్ అందుకోవాలని పాన్ ఇండియన్ కథలతో విశ్వ ప్రయత్నాలూ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడేళ్ళు గ్యాప్ వస్తోంది. ఈ గ్యాప్‌లో మిగతా హీరోలు దూసుకు వస్తున్నారు. సాహో తర్వాత ప్రభాస్‌కు బాగా గ్యాప్ వచ్చింది. రాధే శ్యామ్ గనక అనుకున్న సమయానికి రిలీజ్ అయి ఉంటే ఈ గ్యాప్‌లో మరొక హీరో రికార్డ్స్ ఉండేవి కాదు. కానీ, రాధే శ్యామ్ బాగా ఆలస్యం అవడంతో ఏకంగా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, పుష్ప: ది రైజ్ పార్ట్ 1 సినిమాలతో ఊహించని సక్సెస్‌లు అందుకొని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేశారు.

Prabhas – Allu arjun: మా బన్నీ నంబర్ 1 ప్లేస్‌కు చేరుకున్నాడని గొప్పగా చెప్పుకుంటున్నారు.

ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ హిట్స్ అందుకున్న అల్లు అర్జున్ వసూళ్ళ పరంగా కూడా రికార్డుల మోత మోగించాడు. ఇటీవల వచ్చిన పుష్ప పార్ట్ 1తో హిందీతో పాటు అన్నీ సౌత్ భాషలలో భారీ సక్సెస్‌లను అందుకోవడంతో పాటు పాన్ ఇండియన్ స్థాయిలో సక్సెస్ అందుకున్నాడు. దాంతో ఎన్నో ఏళ్ళ నుంచి అల్లు అర్జున్ చేరుకోవాలనుకున్న నంబర్ 1 స్థానాన్ని ఇప్పుడు చేరుకున్నాడు. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు ప్రభాస్‌ను దాటుకొని మా బన్నీ నంబర్ 1 ప్లేస్‌కు చేరుకున్నాడని గొప్పగా చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఈ ప్లేస్‌లో బన్నీ ఎంతకాలం ఉంటాడో.


Share

Related posts

Japanese: జాపనీస్ ఎక్కువ కాలం బ్రతకడానికి పాటించే ఆరోగ్య రహస్యాలు ఇవే!!

Naina

ATM Cash Robbery Case: కూకట్ పల్లి కాల్పుల ఘటనకు పాల్పడింది వాళ్లే..! దోచుకెళ్లింది ఎంతంటే..?

somaraju sharma

Raviteja: మెగాస్టార్ స్క్రిప్ట్ తో  రవితేజతో సినిమా చేస్తున్న టాప్ డైరెక్టర్..??

sekhar