బన్ని, సుక్కు .. హ్యాట్రిక్

మ‌హేష్‌ను డైరెక్ట్ చేయాల్సిన సుకుమార్ రూట్ మార్చాడు. మ‌హేష్‌కు క‌థ న‌చ్చ‌క‌పోవ‌డం.. మ‌హేష్ త‌దుప‌రి అనీల్ రావిపూడి సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూప‌డంతో ఇన్నాళ్లు వెయిట్ చేసిన ద‌ర్శ‌కుడు సుకుమార్ .. త‌దుప‌రి సినిమాను అల్లు అర్జున్‌తో చేయ‌బోతున్నాడు. అల్లు అర్జున్ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన ఆర్య సినిమాను డైరెక్ట్ చేసింది సుకుమార్ అనే సంగ‌తి తెలిసిందే. 2004లో ఆర్య విడుద‌లై సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. త‌ర్వాత మ‌రో ఐదేళ్ల‌కు ఆర్య 2 విడుద‌లైంది. అయితే ఈసారి మాత్రం గ్యాప్ మ‌రీ ఎక్కువైంది. ప‌దేళ్ల త‌ర్వాత ఈ కాంబినేష‌న్‌లో సినిమా రానుండ‌టం విశేషం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మించ‌నుంది. మ‌హేష్ రిజెక్ట్ చేసిన క‌థ‌నే బ‌న్ని చేస్తాడా?  లేక కొత్త క‌థ‌తో ముందుకెళ‌తారా? అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ముందుగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్ని సినిమా చేసేయ‌బోతున్నాడు. ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌కు వెళ్ల‌నుంది మ‌రి. బ‌న్ని, త్రివిక్ర‌మ్ మూవీ అల్లు అర్జున్‌కి 19వ సినిమా అయితే.. సుకుమార్‌తో బ‌న్ని చేయ‌బోయేది 20వ చిత్రం.