Allu arjun: ‘పుష్ప’ తరవాత తగ్గిపోతాడులే అనుకుంటే .. ప్రభాస్ ని మించి ఎదిగే ప్రాజెక్ట్ తో వస్తోన్న అల్లు అర్జున్ !

Share

Allu arjun: ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలందరూ పాన్ ఇండియన్ స్టార్ అనిపించుకోవడానికి తెగ తాపత్రయపడుతున్నారు. అందుకు ఏకంగా ప్రభాస్‌నే టార్గెట్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ రేంజ్‌లో ప్రభాస్‌కు ఏ రేంజ్‌లో క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఆయన మార్కెట్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీతో పాటు అన్నీ సౌత్ భాషలలోనూ అసాధారణంగా పెరిగిపోయింది. అందుకే అందరూ ఆ రేంజ్ పాపులారిటీ సాధంచాలని ప్రాజెక్ట్స్‌ను పాన్ ఇండియన్ స్థాయిలో ఎంచుకుంటున్నారు.

allu-arjun-is coming with next project
allu-arjun-is coming with next project

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్.టి.ఆర్, రాం చరణ్‌లకు ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియన్ స్టార్ అనే క్రేజ్ వస్తుందని అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి అభిమానులు ఫిక్సైపోయారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఇదే స్టార్ డం కోసం బాగా ట్రై చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన పుష్ప అనే పాన్ ఇండియన్ సినిమాతో కొంత వరకు ఆ సక్సెస్‌ను అందుకున్నట్టే అని అభిమానులు చెప్పుకుంటున్నారు. కానీ, అల్లు అర్జున్‌కు మాత్రం అది చాలదన్నట్టుగా ఈసారి భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు.

Allu arjun: సాలీడ్ ప్రాజెక్ట్‌ను త్వరలో అనౌన్స్..!

ఫిబ్రవరి నుంచి సుకుమార్‌తో పుష్ప పార్ట్ 2 చిత్రాన్ని ప్రారంభించబోతున్నాడు. అయితే దీనికంటే సాలీడ్ ప్రాజెక్ట్‌ను త్వరలో అనౌన్స్ చేయనున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఇంతకముందు యాక్షన్ చిత్రాల దర్శకుడిగా బాగా పాపులారిటీ ఉన్న బోయపాటి శ్రీను అల్లు అర్జున్‌తో సరైనోడు చిత్రాన్ని తీసి భారీ కమర్షియల్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో పాన్ ఇండియన్ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందని సమాచారం.


Share

Related posts

`గుణ 369` సెన్సార్ పూర్తి

Siva Prasad

బిగ్ బాస్ 4 : గంగవ్వా నువ్వు వస్తే చాలు ‘ ఇంత అమౌంట్ ‘ ఇస్తాం అంటున్న మాటీవీ ??

Varun G

ల‌క్ష్మీభూపాల్ ఇంట‌ర్వ్యూ

Siva Prasad