Allu Arjun: 2021లో “పుష్ప” సినిమా విడుదలయ్యాక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమా రాకముందు తెలుగు మరియు మలయాళం ఇంకా దక్షిణాదికి చెందిన కొన్ని భాషల్లో క్రేజ్ ఉండేది. టాలీవుడ్ తో పాటు మలయాళం ఇండస్ట్రీలో భారీ ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితి ఉండేది. కానీ పుష్పాతో నేషనల్ మరి ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. భారత్ ఆర్మీ చేత కూడా గౌరవ వందనం స్వీకరించుకునే లెవెల్ లో బన్నీ క్రేజ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఇదిలా ఉంటే దక్షిణాది సినిమా రంగానికి చెందిన హీరోలలో తాజాగా నెంబర్ వన్ పొజిషన్ లో బన్నీ నిలిచారు.
పూర్తి విషయంలోకి వెళ్తే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే బన్నీ ఇంస్టాగ్రామ్ లో ఓ అరుదైన మైలురాయని అందుకోవటం జరిగింది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోగా బన్నీ నిలిచారు. పుష్ప సినిమా విడుదలకు ముందు 14 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన బన్నీ.. ప్రస్తుతం 20 మిలియన్ ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో నిలిచారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మొదటి షెడ్యూల్ విశాఖపట్నంలో ఇంట్రడక్షన్ మరియు కొన్ని సాంగ్స్ చిత్రీకరణ చేశారు. ఆ తరువాత హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంది. మరికొద్ది రోజుల్లో బ్యాంకాక్ లో దట్టమైన అడవులలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతునట్లు సమాచారం.
కాగా ఏప్రిల్ నెలలో అల్లు అర్జున్ బర్త్ డే నేపథ్యంలో “పుష్ప 2” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పుష్ప మొదటి భాగం కంటే సెకండ్ పార్ట్ ఎక్కువ భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఏడాది డిసెంబర్ నెలలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. భారతదేశంలో ఏ సినిమా రిలీజ్ కానీ రీతిలో ఎక్కువ భాషలలో ఈ సినిమా విడుదల చేయనున్నారట.