కరోనా వైరస్ రావటంతో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నిర్ణయం తీసుకోవడంతో మొన్నటిదాకా అన్ని వ్యవస్థలు క్లోజ్ అయిపోయాయి. సినిమా ఇండస్ట్రీలో షూటింగులు కూడా జరగని పరిస్థితి నెలకొంది. దీంతో ఇంటికే పరిమితమైన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా బయట పబ్లిక్ లో కి రావటం జరిగింది. పూర్తి విషయంలోకి వెళితే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ “పుష్ప” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్మగ్లర్ గా లారీ డ్రైవర్ పాత్రలో ఉరా మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ నటిస్తున్నట్లు వార్తలు రావడం జరిగింది.
కాగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా వరకూ అడవి ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో …. సినిమా అంతా ఓకే అయిన సమయం లో కరోనా వైరస్ రాకముందు విదేశాల్లో షూటింగ్ జరుపాలని సినిమా యూనిట్ రెడీ అయింది. అయితే మహమ్మారి ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితులను మారిపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ప్రదేశాల లోకేషన్ లలో సినిమా యూనిట్ అల్లు అర్జున్ పర్యటించడం జరిగింది.
ఈ క్రమంలో కుంటాల జలపాతం వద్ద అల్లు అర్జున్ తనతోపాటు ఉన్న కుటుంబ సభ్యులతో కాసేపు ఆస్వాదించారు. అదే జలపాతం వద్ద పర్యాటకుల ఉండటంతో బన్నీ సొంతంగా తయారు చేయించుకున్న మాస్కు చాలా వెరైటీగా ఉండటంతో దానితో ఫోటోల కోసం ఎగబడ్డారు. ఆ మాస్క్ పై “AA” అనే అక్షరాలు ఉండటంతో డ్రెస్ కలర్ కి మ్యాచింగ్ అయ్యేవిధంగా బన్నీ సొంతంగా తయారు చేయించుకోవడం జరిగింది. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో…. గుబురు జుట్టుతో ఉన్న బన్నీ మరియు మాస్కు చూసి బన్నీ అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.