Allu Arjun: ఐకాన్ స్టార్ బన్నీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా కాంపౌండ్ నుండి ఎంట్రీ ఇచ్చినా గాని ప్రతి సినిమా… తన మొదటి సినిమా అన్న రీతిలో అల్లు అర్జున్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడని ఆయన గురించి తెలిసిన డైరెక్టర్లు చెబుతుంటారు. ఈ విషయాన్ని ప్రముఖ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఒకానొక సమయంలో తన కొడుక్కి కష్టపడాలి అనే విషయం గురించి.. చెప్పాల్సివస్తే బన్నీని చూడాలి అంటూ ఇంటర్వ్యూ లో ప్రత్యేకంగా అల్లుఅర్జున్ హార్డ్ వర్క్ గురించి చెప్పడం జరిగింది. ఆ రీతిగా సినిమాలు చేస్తూ ప్రతీ సినిమాకి సరికొత్త మేకోవర్ తో అలరించే బన్నీ డాన్స్ పరంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది.
అదే రీతిలో ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక కేరళలలో కూడా సత్తా చాటుతూ ఉన్నాడు బన్నీ. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కేవలం తెలుగులో సినిమాలు చేస్తూ భారీ మార్కెట్ క్రియేట్ చేసుకున్న బన్నీ కెరీర్లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ చేసుకోవటం జరిగింది. కాగా తాజాగా బన్నీ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్ ఇటీవల బయటపడింది.
ఆ లిస్ట్ డీటెయిల్స్ మీకోసం… జయం, భద్ర, 100% లవ్, పండగ చేసుకో, ఒక లైలా కోసం, కృష్ణాష్టమి, అర్జున్ రెడ్డి, గ్యాంగ్ లీడర్, డిస్కో రాజా, జాను, గీతా గోవిందం, అరవింద సమేత వీర రాఘవ. దాదాపు లిస్టులో సినిమాలు పరిశీలిస్తే ఎక్కువ బ్లాక్ బస్టర్ సినిమాలు. దీంతో చేతిదాకా వచ్చిన ఈ సినిమాలు బన్నీ రీజెక్ట్ చేయటంతో వేరేవాళ్లు చేసి భారీ విజయాలు నమోదు చేసుకోవడం జరిగింది. తాజాగా ఈ లిస్టులో సోషల్ మీడియాలో బయటపడటంతో… ఈ లిస్టులో చివరిలో కొన్ని సినిమాలు చేసిన బన్నీ రేంజ్ ఇప్పుడున్న దానికంటే డబుల్ త్రిబుల్ గా ఉండేది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.