Sukumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ బన్నీ మధ్య బాండింగ్ వెరీ స్పెషల్ అని అందరికీ తెలుసు. చాలా వేదికలపై అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలో నేను ఈ రేంజ్ లో ఉన్నాను అంటే.. దానికి ప్రధాన కారణం సుకుమార్ అరే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల పుష్పా సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సమయంలో కూడా.. సక్సెస్ మీట్ లో సుకుమార్ లేకపోతే నేను లేను అని కూడా బన్నీ బహిరంగంగా కామెంట్లు చేయడంతోపాటు కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనంగా మారింది.
సుకుమార్ కూడా తాను బతికి ఉండటానికి గల కారణం అల్లు అర్జున్ అని.. ఆర్య సినిమా షూటింగ్ సమయంలో బోటు నీళ్లలో పడిపోగా నేను ఆ టైంలో మునిగిపోతుండగా..అందరూ చూస్తుండగా… ఒక్కసారిగా బన్నీ దూకి నన్ను కాపాడాడు. బన్నీ రియల్ హీరో అంటూ చెప్పుకు రావడం జరిగింది. ఇదిలా ఉంటే సుకుమార్ శిష్యుడిగా ఉప్పెన అనే మొదటి సినిమాతోనే డైరెక్టర్ బుచ్చిబాబు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం తెలిసింది. సినిమా టేకింగ్ లేదా స్క్రీన్ ప్లే చాలా అద్భుత రీతిలో.. బుచ్చిబాబు చేయడం జరిగింది. ఈ సినిమా చూసిన చాలామంది బుచ్చిబాబు తో సినిమా చేయాలని క్యూ కట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి.
అయితే ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా చేస్తున్నట్లు మొన్నటివరకు వార్తలు తాజాగా.. ఐకాన్ స్టార్ బన్నీ.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు కి అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల లవ్ స్టోరీ నేపథ్యంలో.. కథ బన్నీకి బుచ్చిబాబు వినిపించినట్లు.. విపరీతంగా నచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం బన్నీ పుష్పా 2 సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు సినిమా స్టార్ట్ చేయనున్నట్లు.. ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ బన్నీ దాక వెళ్లడానికి సుకుమార్ రికమండేషన్ చేసినట్లు… బుచ్చిబాబు చెప్పిన స్టోరీ ఫస్టు సుక్కు విని ఇది బన్నీకి అయితే బాగుంటుంది అని చెప్పడంతో బన్నీ కూడా ఇటీవల విని ఓకే అన్నట్లు ఇండస్ట్రీలో టాక్.