Adipurush: 2021 “పుష్ప” సినిమాతో అల్లు అర్జున్ తలరాత పూర్తిగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రాకముందు “అలా వైకుంఠపురంలో” సినిమాతో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. 2020లో “అలా వైకుంఠపురంలో” విడుదలయ్యింది. అంతకుముందు 2018లో “నా పేరు సూర్య…నా ఇల్లు ఇండియా” విడుదలయ్యి అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత దాదాపు రెండున్నర సంవత్సరాలు పాటు ఏ సినిమాలో చేయకుండా బన్నీ ఖాళీగా ఉండటం జరిగింది. ఆ సమయంలో చాలా కథలు విన్నాక త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ విని “అలా వైకుంఠపురంలో” చేసి అదిరిపోయే విజయం ఖాతాలో వేసుకున్నారు.
ఆ తర్వాత వెంటనే సుకుమార్ తో పుష్ప సినిమాతో పాన్ ఇండియా నేపథ్యంలో మొట్టమొదటిసారి సినిమా చేసి ఊహించని విజయం అందుకోవటం జరిగింది. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా బన్నీకి విపరీతమైన మార్కెట్ క్రియేట్ అయింది. సినిమా పరంగా దూసుకుపోతున్న బన్నీ వ్యాపార రంగంలో కూడా దిగటం జరిగింది. మేటర్ లోకి వెళ్తే మహేష్ బాబు మాదిరిగా మల్టీప్లెక్స్ వ్యాపార రంగంలో బన్నీ అడుగు పెట్టడం జరిగింది. హైదరాబాద్ నడిబొడ్డు అమీర్ పేట్ లో “అల్లు అర్జున్ సినిమాస్” పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించడం జరిగింది. లాడ్జ్ ఫార్మేట్ ఎపిక్ స్క్రీన్ తో సహా ఫైవ్ స్క్రీన్ లతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించటానికి థియేటర్ రెడీ కావడం జరిగింది.
దాదాపు రెండు సంవత్సరాలు పాటు నిర్మాణం జరుపుకున్న ఈ థియేటర్ జూన్ 16వ తారీకు ఓపెన్ కానుంది. ఈ క్రమంలో మొట్టమొదటిగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” సినిమాతో థియేటర్ ప్రారంభించబోతున్నారు. ఆరోజు ఉదయం అల్లు అర్జున్ కుటుంబ సభ్యుల ప్రత్యేకమైన పూజలు చేసి థియేటర్ ఓపెన్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ డిసెంబర్ నెలలోనే విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ రెడీ అవుతుంది. “పుష్ప 2” కంప్లీట్ అయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నాలుగో సినిమా చేయనున్నట్లు సమాచారం.