స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్ని తాను ఏ పని చేసినా ఎంత కొత్తగా ఆలోచిస్తానో అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా బన్ని క్యారీవ్యాన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వినపడుతూనే ఉన్నాయి. సాధారణంగా చిత్ర నిర్మాతలే హీరో, హీరోయిన్స్ కోసం క్యారీ వ్యాన్స్ ఏర్పాటు చేస్తుంటారు. కానీ బన్ని మాత్రం ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్యారీ వ్యాన్‌ను రెడీ చేసుకున్నాడు. 360 డిగ్రీలు కుర్చీ, మూడ్ లైటింగ్, గేమింగ్ జోన్, ఎల్ఈడీ లైటింగ్‌తో మేకప్ మిర్రర్, స్పెషల్ లాంగ్ ఇవన్నీ ఆ క్యారీ వ్యాన్ స్పెషాలిటీ.
“జీవితంలో నేను ఖరీదైన వస్తువును కొన్న ప్రతిసారి ప్రజలు నా మీద ఏంతో ప్రేమ చూపించారు. కాబట్టే ఇలాంటివి కొనగలుగుతున్నాను. థాంక్స్. దీని పేరు ఫాల్కన్“ అంటూ బన్ని సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టారు. ఈయన ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
previous post
next post