ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ “పుష్ప 2” కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ నెలలో వచ్చిన “పుష్ప” దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని విజయాన్ని సాధించింది. ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోయినా బాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్లకు పైగా వసూలు సాధించటం సంచలనం రేపింది. “పుష్ప”లో పాటలు మరియు యాక్షన్స్ సన్నివేశాలు.. బన్నీ మేనరిజం.. చాలామంది సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ఇటువంటి తరుణంలో “పుష్ప” సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే వచ్చే నెల నుండి “పుష్ప 2” షూటింగ్ స్టార్ట్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయింది. రెండో భాగాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వాళ్ళు 350 కోట్లతో నిర్మించడానికి రెడీ అయ్యారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న.. ఈ సినిమాలో.. బాలీవుడ్ నటులు కూడా నటించనున్నట్లు సమాచారం. అయితే త్వరలో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందన్న సమయంలో తాజాగా బన్నీ బ్లాక్ టీ షర్ట్ వేసుకుని కొత్త లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ నీ షేక్ చేస్తోంది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన మొదటి భాగం “పుష్ప” కంటే ఎక్కువ భాషలలో రెండో భాగం రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది.
పాన్ ఇండియా రేంజ్ లో మరింత విజయం సాధించాలని డైరెక్టర్ సుకుమార్ స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. వాస్తవానికి “పుష్ప” మొదటి భాగం డిసెంబర్ లో రిలీజ్ అవ్వగా మార్చి నుండి “పుష్ప 2” స్టార్ట్ చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేసింది. కానీ మొదటి భాగం భారీ విజయం సాధించడంతో రెండోది మరింతగా.. విజయం సాధించాలని స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు.. చేయటం జరిగిందట. అందువల్లే షూటింగ్ ఆదర్శం అయినట్లు ఇండస్ట్రీలో టాక్.