Pushpa 2: ప్రపంచ సినిమా రంగం “పుష్ప 2” కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. గత ఏడాది డిసెంబర్ 17 వ తారీకు విడుదలైన “పుష్ప” ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. డైరెక్టర్ సుకుమార్ టేకింగ్.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. సుకుమార్ అదే విధంగా హీరో బన్నీకి ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా అయిన గాని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రీతిలో సినిమాని ముందుకు నడిపించారు. “పుష్ప” మొదటి భాగం డైలాగులు, ఫైట్స్, స్టోరీ ఇంకా పాటలన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
ముఖ్యంగా తగ్గేదేలే అనే డైలాగ్.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇటీవల రష్యాలో కూడా రిలీజ్ చేశారు. అక్కడ పుష్ప టీం మొత్తం ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ సందడి చేయడం జరిగింది. అక్కడి మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వటంతో పాటు అభిమానులతో ఫోటోలు కూడా దిగారు. సరిగ్గా సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ అయిన తరుణంలో పుష్ప టీం రష్యా వెళ్లడం జరిగింది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా “పుష్ప 2″కి సంబంధించి ఒక డైలాగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది.
“అడవిలో నాలుగు జంతువులు వెనకడుగు వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి నాలుగో అడుగుల వెనక్కి వేసింది అంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం అంటూ ఓ మాస్ డైలాగ్ నీ పోస్టులు చేస్తూ వైరల్ చేస్తున్నారు. దీనిపై సినిమా యూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియానీ షేక్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ డిసెంబర్ 17వ తారీకుకి “పుష్ప” మొదటి భాగం విడుదల అయి సంవత్సరం.. కావస్తుండటంతో…”పుష్ప 2″కి సంబంధించి కొత్త అప్ డేట్ ఇచ్చే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.