Pushpa 2: ఐకాన్ స్టార్ బన్నీ బర్తడే నేపథ్యంలో ఒకరోజు ముందుగానే “పుష్ప 2” గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయడం తెలిసిందే. ఈ వీడియో భారీ ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. యూట్యూబ్ నీ షేక్ చేసి పడేసింది. మొదటి పుష్ప పొందిన క్రేజ్ దృష్ట్యా… “పుష్ప 2” గ్లింప్స్ వీడియో రిలీజ్ అయిన ప్రతి భాషలో అందరినీ అంతగాన ఆకట్టుకుంది. ఏప్రిల్ 7వ తారీకు సాయంత్రం రిలీజ్ అయిన ఈ వీడియో వారం రోజులు కాకముందే అన్ని భాషల్లో కలిపి 75 మిలియన్ వ్యూస్ రాగా… మూడు మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇందులో కేవలం హిందీ “పుష్ప 2” గ్లింప్స్ వీడియో… 20 లక్షల లైక్స్ వచ్చాయి.
బాలీవుడ్ ఇండస్ట్రీలో “పటాన్” సినిమాకి సరి సమానంగా “పుష్ప 2” గ్లింప్స్ వీడియో రికార్డుల క్రియేట్ చేస్తూ ఉండని బాలీవుడ్ మీడియా చెప్పుకోస్తోంది. దీన్ని బట్టి చూస్తే బన్నీకి ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని అంటున్నారు. “పుష్ప 2” గ్లింప్స్ వీడియో రిలీజ్ అవ్వకముందు వేర్ ఇస్ పుష్ప.. అనే స్పెషల్ వీడియో కూడా ఎంతో హైప్ క్రియేట్ చేసింది. దీంతో “పుష్ప 2” గ్లింప్స్ వీడియోలో అల్లు అర్జున్ లుక్ చూడటానికి ఇంట్రెస్ట్ కలిగించడం జరిగింది. ఈ క్రమంలో డైరెక్టర్ సుకుమార్ తన మార్క్ కనబడేలా.. బన్నీ లుక్ చూపించడం జరిగింది. అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చినప్పుడు పులి నాలుగడుగులు వెనకేయడం… అదే సమయంలో తగ్గేదేలే మేనరిజంతో బన్నీ చెప్పటం వీడియో అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంది.
మొదటి భాగంలో కంటే రెండో భాగంలో పుష్ప మరింత పవర్ ఫుల్ రోల్ లో ఉండనున్నట్లు వీడియో బట్టి తెలుస్తుంది. పొలిటికల్ టచ్ తో కూడిన స్క్రిప్ట్ అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో ఒక మాఫియా లీడర్ తరహాలో అన్ని కూర్చుని పుష్పదే రూల్ అనే డైలాగ్ పలకటం కూడా చాలా హైలెట్ గా ఉంది. పాన్ ఇండియా నేపథ్యంలో మొదటి భాగం కంటే రెండో భాగం పుష్ప భారీ ఎత్తున రిలీజ్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ సరవేగంగా జరుపుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అమ్మవారి పాత్రలో బన్నీ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మొత్తానికి బన్నీ పుట్టినరోజు నేపథ్యంలో పుష్ప 2 స్పెషల్ వీడియో చాలామందినీ ఆకట్టుకుంటూ ఉంది.