టాలీవుడ్ లో లేటెస్ట్ సంచలనం అల్లు ఫ్యామిలీ నిర్మిస్తున్న అల్లు స్టూడియోస్. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ స్టూడియో నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. నిజానికి ఇండస్ట్రీ వర్గాల్లోనే ఇది చర్చనీయాంశం అయింది. దాదాపు 20 ఏళ్ల క్రితం నుంచి స్టూడియో నిర్మాణంపై మెగాస్టార్ చిరంజీవి – అల్లు అరవింద్ మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయనేది ఇండస్ట్రీ టాక్. చిరంజీవి కూడా స్టూడియో నిర్మాణం వైపు అడుగులు వేయాలని చూశారని అంటారు. అయితే.. అకస్మాత్తుగా అల్లు స్టూడియోస్ నిర్మాణం ప్రారంభమైంది. అయితే.. ఈ స్టూడియో నిర్మాణం వెనుకు ఒక ఆసక్తికరమైన సంఘటన ఉందని ఇటివల సామ్ జామ్ షో లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రివీల్ చేశాడు.
అల్లు స్టూడియోస్ వెనుక కారణం ఏంటి.. అని సమంత అడిగినప్పుడు.. ‘మీకు అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది. రెగ్యులర్ షూటింగ్ నిమిత్తం అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్లినప్పుడు.. “వెల్ కమ్ టు అన్నపూర్ణ స్టూడియోస్” అంటారు. అప్పుడు అది నా స్టూడియోనే అనిపిస్తుంది. మేమెందుకు స్టూడియో కట్టకూడదు.. అనిపించింది. అలా అనుకున్న కొన్ని నెలల్లోనే స్టూడియో నిర్మాణం ప్రారంభించాం’ అని చెప్పుకొచ్చాడు బన్నీ. దీంతో అల్లు స్టూడియో నిర్మాణం వెనుక ఉన్న కథను చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ స్టూడియో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ లో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోస్, రామోజీ ఫిలిం సిటీ.. సరసన మరో భారీ స్టూడియో రానుంది.
రామోజీ ఫిలిం సిటీలో అయితే.. ఏకంగా అంతర్జాతీయ సినిమాల షూటింగ్స్ హడావిడి కూడా ఉంటుంది. అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోస్ లో నిత్యం షూటింగ్స్ హడావిడే. ఇప్పుడు వీటికితోడు అల్లు స్టూడియోస్ రాబోతోంది. భారతీయ సినీ పరిశ్రమలో తెలుగు సినీ పరిశ్రమకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సినిమా నిర్మాణాలు, కలెక్షన్లు, స్టూడియోలు.. ఇలా ప్రతి అంశంలోనూ ప్రత్యేకత దక్కించుకుంది. ఇప్పుడు అల్లు స్టూడియోస్ తో మరింత కళ రాబోతుందనే చెప్పాలి.