Allu Arjun-Arha: టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మరోవైపు ఫ్యామిలీ మెన్‌గా కూడా మంచి మార్కులు వేయించుకున్నారు. షూటింగ్స్ నుంచి ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతోనే టైమ్ స్పెండ్ చేస్తుంటాడీయన. అలాగే తరచూ భార్యా, పిల్లలతో వెకేషన్స్‌కి వెళ్తుంటాడు.
ఇక నిన్న సండే కావడంతో కూతురు అర్హతో బన్నీ ఫుల్ ఎంజాయ్ చేశాడు. తన ఇంటి ఆవరణలో అర్హతో కలిసి రన్నింగ్ రైస్‌లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బన్నీ సతీమణి స్నేహా రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. రన్నింగ్ రైస్‌లో కూతురును గెలిపించడానికి బన్నీ వెనుకబడడం.. గెలిచిన కూతురుని ఎత్తుకొని ప్రేమగా ముద్దాడటం ఈ వీడియోలో చూడొచ్చు.
అల్లు అభిమానులనే కాదు నెటిజన్లను సైతం ఆకట్టుకుంటున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హాల్ చల్ చేస్తోంది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల `పుష్ప` వంటి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదలై మంచి విజయం సాధించింది. ఇక బన్నీ ప్రస్తుతం `పుష్ప 2` చిత్రాన్ని చేయనున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.
https://www.instagram.com/reel/CZofsejlI49/?utm_source=ig_web_copy_link
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!