సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ లుగా ఉంటూ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది హీరోలు లాభం అపేక్షిస్తూ ఏ కంపెనీలకు పడితే ఆ కంపెనీలకు ప్రోడక్ట్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా రాణిస్తారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలైతే లిక్కర్ ఇంకా గుట్కా కంపెనీలకు… వాలిచ్చే డబ్బులు పోయి ప్రజల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా చేస్తూ ఉంటారని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఒక గుట్కా యాడ్ కి సంబంధించి అక్షయ్, షారుక్, అజయ్ దేవగన్ కలిసి నటించగా అంతకుముందు గుట్కాలపై వ్యతిరేకంగా పోరాడిన అక్షయ్… గుట్కా యాడ్ లో నటించడం పెద్ద వివాదంగా మారడం జరిగింది.
ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ “పుష్ప: సినిమాతో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ తాజాగా ఏర్పడటం జరిగింది. దీంతో బన్నీకి ప్రముఖ కంపెనీలు అంబాసిడర్ గా ఉండాలని క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని గుట్కా కంపెనీలు టొబాకో కంపెనీలు కూడా బన్నీకి ఆఫర్లు చేస్తూ ఉన్నాయి. గతంలో ఒక గుట్కా కంపెనీ ఆఫర్ చేయగా బన్నీ తిరస్కరించారు. కాగా ఇప్పుడు ఇదే రీతిలో ఓ గుట్కా బ్రాండ్, లిక్కర్ కంపెనీ తమకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని కోరాయట. ఇందుకు గాను పది కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఇస్తామని కంపెనీ యాజమాన్యం భారీ ఆఫర్ చేశాయట.
అయినా కానీ బన్నీ లిక్కర్, గుట్కా బ్రాండ్‌కు ప్రచారం చేయడానికి నిరాకరించాడట. భారీగా రెమ్యూనరేషన్ ఇస్తామన్నా అందుకు అంగీకరించలేదట. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి .. ఇబ్బంది కలిగించే కంపెనీలనీ ప్రోత్సహించకూడదు అని అల్లు అర్జున్ డిసైడ్ అయినట్లు.. అందుకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందట. గతంలోనూ పలు గుట్కా కంపెనీలు ఆఫర్ చేయగా తిరస్కరించారు. మళ్లీ ఇప్పుడు బన్నీ రెండోసారి తిరస్కరించడం సంచలనం రేపింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో బన్నీ ఫాన్స్ ఫుల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మావాడు చాలా గ్రేట్ అని కొంతమంది అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.