Allu Arjun: గత ఏడాది ఐకాన్ స్టార్ బన్నీ “అలా వైకుంఠపురం లో” సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టడం తెలిసిందే. ఈ సినిమా రాకముందు “నాపేరు సూర్య” తో దారుణమైన డిజాస్టర్ చూసి చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని అనేక స్టోరీలు విని చివరాకరికి తనకి గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి బ్లాక్బస్టర్ విజయాలను అందించిన త్రివిక్రమ్.. చెప్పింది “అలా వైకుంఠపురం లో” సినిమా కి ఓకే చెప్పి అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
ప్రస్తుతం బన్నీ… సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. సినిమాలో అల్లు అర్జున్ కెరీర్ లో ఎప్పుడు ఎన్నడూ చేయని క్యారెక్టర్లు చేస్తున్నారు. ఒకటి లారీ డ్రైవర్ పాత్ర మరొకటి గంధపు చెక్కల స్మగ్లర్ గా బన్నీ నటిస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో డైరెక్ట్ హిందీ ఫిలిం చేయటానికి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
Read More: Bunny: ఈసారి కూడా అదే హైలెట్ చేయబోతున్న బన్నీ- సుకుమార్..??
బన్నీకి సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్ డాన్సర్ అన్న ఇమేజ్.. ఆల్రెడీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉంది. దీంతో ఆ తరహాలో.. ఓ ప్రముఖ డైరెక్టర్ కథ రెడీ చేసినట్లు ఈ సినిమాని పేరుగాంచిన ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కేవలం ఈ సినిమా హిందీలో మాత్రమే చిత్రీకరణ జరుగుతుందని సరికొత్త టాక్ ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది.