Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పక్క తెలుగులో మాత్రమే కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించింది. ప్రారంభంలో తెలుగులో మాత్రమే ఉండగా ఆ తర్వాత మలయాళంలోకి… మెల్లమెల్లగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బన్నీ “పుష్ప” సినిమాతో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో… ఎదిగిపోయాడు. నేషనల్.. ఇంటర్నేషనల్ స్థాయిలో బన్నీ క్రేజ్ విస్తరించింది. ఫస్ట్ టైం హిందీలో స్ట్రైట్ గా “పుష్ప” రిలీజ్ చేయగా అక్కడ స్టార్ హీరోలతో పోటీ పడుతూ కలెక్షన్లు సాధించడం దేశవ్యాప్తంగా అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అంతకుముందే బన్నీ హిందీ డబ్… సినిమాలు యూట్యూబ్ లో మంచి ఆదరణ దక్కించుకోవడం తెలిసిందే. టాలీవుడ్ లో మాత్రమే కాక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఏ హీరో సినిమాలకు లేని న్యూస్ బన్నీ కి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బన్నీ యూట్యూబ్ లో మరోసారి సత్తా చాటడం జరిగింది. విషయంలోకి వెళితే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రెండు తెలుగు ఆల్బమ్స్ యూట్యూబ్ లో వన్ బిలియన్ వ్యూస్ సాధించడం హిస్టరీగా మారింది.
మేటర్ లోకి వెళ్తే 2020లో బన్నీ నటించిన “అలా వైకుంఠపురం” సినిమా అదేవిధంగా.. గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన “పుష్ప” సినిమా ఆల్బమ్స్ … రెండూ కూడా వన్ బిలియన్ వ్యూస్… సాధించడం జరిగింది. దీనితో బన్నీ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉండటం మాత్రమేకాక సోషల్ మీడియాలో ఈ వార్తలపై స్పందిస్తూ ఏ బిడ్డ యూట్యూబ్ బన్ని అడ్డ అంటూ… కీలక కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పుష్పా కి విపరీతమైన ఆదరణ ప్రపంచవ్యాప్తంగా రావడంతో… సెకండ్ పార్ట్ ఇండియాలో ఏ సినిమా రిలీజ్ అవ్వని విధంగా.. అనేక భాషల్లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. శ్రీవల్లి సాంగ్ స్టెప్ తోపాటు… తగ్గేదేలే డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావటంతో సెకండ్ పార్ట్ అదే తరహాలో…సాంగ్స్ డైలాగ్ లు… ఉండే రీతిలో బన్నీ.. సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!