ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగానికి సంబంధించి.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే గుర్తొచ్చేది బాలీవుడ్ ఇండస్ట్రీ. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు మొత్తం సౌత్ ఫిలిం ఇండస్ట్రీ హవా కొనసాగుతోంది. బాహుబలి 2, RRR, పుష్ప… వంటి సినిమాలు సృష్టించిన ప్రభంజనం.. ప్రపంచ సినీ రంగాన్ని దక్షిణాది సినిమా రంగం వైపు మళ్లించేలా చేసింది. పైగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం.. అక్కడ వారి సినిమాల కంటే దక్షిణాది సినిమాలనే హిందీ ప్రేక్షకులు ఎక్కువ ఆదరిస్తున్నారు. ఈ పరిణామంతో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో చాలామందికి బాలీవుడ్ లో ఒక మార్కెట్ ఏర్పడింది. ఈ పరిణామంతో చాలావరకు మీడియా సమావేశాలలో పేరుగాంచిన సౌత్ స్టార్ హీరోలు బాలీవుడ్ ఎంట్రీ కి సంబంధించిన ప్రశ్నలు మీడియా ప్రతినిధుల నుండి ఎదుర్కొంటున్నారు.
ఆ విషయంలో అల్లు అర్జున్ తో పోటీ పడుతున్న విజయ్ దేవరకొండ..??
ఈ క్రమంలో బాలీవుడ్ మీడియా ఎంట్రీ కి సంబంధించి మహేష్ చేసిన వ్యాఖ్యలు గతంలో పెను దుమారని రేపడం తెలిసిందే. తెలుగులోనే నాకు కంఫర్ట్ ఉంది బాలీవుడ్ నన్ను తట్టుకోలేదు అని.. మహేష్ చెప్పటం సంచలనం రేపింది. ఇప్పుడు ఇదే తరహాలో ఐకాన్ స్టార్ బన్నీ కూడా ప్రశ్న ఎదుర్కోవడం జరిగింది. మామూలుగానే బన్నీకి హిందీలో “పుష్ప” రాకముందే మంచి క్రేజ్ ఉంది. బన్నీ నటించిన సినిమాలు యూట్యూబ్ లో డబ్ అయి రికార్డు స్థాయి వ్యూస్ రాబట్టడం జరిగింది.
దీంతో పుష్ప సినిమాని బాలీవుడ్ ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఒక్క ప్రమోషన్ చేయకపోయినా గానీ హిందీలో “పుష్ప” వంద కోట్లు కలెక్ట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా బాలీవుడ్ ఎంట్రీ గురించి బన్నీ మాట్లాడుతూ.. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ అనేది కంఫర్ట్ జోన్. హిందీ సినిమాలంటే అవసరమైతేనే చేస్తాను అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో బన్నీ తెలపడం జరిగిందంట. దీంతో బండి చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్ మీడియా ప్రముఖంగా ప్రచారం చేస్తున్నట్లు టాక్. పుష్ప ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులు పుష్ప రెండో భాగం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి బాలీవుడ్ ఇండస్ట్రీలో “పుష్ప” సినిమా యూనిట్ రెండో పార్ట్ కి భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!