Allu Arjun : మహేష్ బాబు డైరెక్టర్ తో అల్లు అర్జున్..??

Share

Allu Arjun : గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం లో సినిమాకి పోటీగా రాగా ..బన్నీ నటించిన “అల వైకుంఠపురం లో” భారీ స్థాయిలో విజయం సాధించింది. ఇదిలా ఉంటే “సరిలేరు నీకెవ్వరు” సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి తో తాజాగా అల్లు అర్జున్ సినిమా చేయటానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

allu arjun with mahesh director
allu arjun with mahesh director

అల్లు అర్జున్ కెరీర్ లో భారీ స్థాయిలో కామెడీ ఎంటర్టైనర్ తరహాలో ఈ సినిమా ఉండబోతుందట. ఒకపక్క కామెడీ మరోపక్క యాక్షన్ ఫ్యామిలీ తరహాలో స్టోరీ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే స్టోరీ కి సంబంధించి చిన్నపాటి లైన్ బన్నీకి విపరీతంగా నచ్చినట్లు..దానిని స్క్రిప్ట్ రూపంలో పూర్తిగా మలచడానికి అనిల్ రావిపూడి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నారు. కొరటాల తర్వాత అనిల్ రావిపూడి తో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టిన రోజు నేపథ్యంలో అనిల్ రావిపూడి ప్రాజెక్టుకు సంబంధించి ఏదైనా విషయం అధికారికంగా వెలువడే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి


Share

Related posts

బ్రేకింగ్: శిరోముండనం కేసులో అరెస్టైన నూతన్ నాయుడు

Vihari

నిశ్చితార్థం చేసుకున్న సింగర్ సునీత..!!

sekhar

ఎన్టీఆర్ సినిమా గురించి స్పందించని తారక్

Siva Prasad