సినిమా

Pushpa: పుష్ప సెకండ్ పార్ట్ కోసం.. బిగ్ ఛాన్స్ వదిలేసుకున్న అల్లు అర్జున్..??

Pushpa srivalli gets rare record
Share

Pushpa: త్రివిక్రమ్ దర్శకత్వంలో అలా వైకుంఠపురం లో సినిమా చేస్తున్న సమయంలోనే బన్నీ “ఐకాన్” సినిమా ఓకే చేయటం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో… బన్నీ ఈ ప్రాజెక్టుని ఓకే చేయడం జరిగింది. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. “పుష్ప” సినిమా రిలీజ్ అయిన వెంటనే.. బన్నీ ఐకాన్ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారన్న ప్రచారం కూడా సాగింది. అయితే తాజాగా ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం బన్నీ ఐకాన్ ప్రాజెక్టుని వదులుకున్న ట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Kannada Journo Fires On Pushpa, Allu Arjun Says Sorry - Movie News

“పుష్ప” మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో తనకంటూ సపరేట్ గుర్తింపు తీసుకురావడంతో ఇప్పుడు బన్నీ దృష్టి మొత్తం రెండో భాగం పెట్టినట్లు.. దీంతో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ని… కుర్ర స్టార్ హీరో రామ్ పోతినేని తో చేయనున్నట్లు సమాచారం. అంతమాత్రమే కాదు రామ్ కోసం ఇప్పటికే స్టోరీ లో మార్పులు కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే.. ఐకాన్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కీలక ప్రకటన కూడా రానున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Karnataka calls for boycotting Allu Arjun's film Pushpa The Rise: Part 1-  Cinema express

“పుష్ప” చేస్తున్న సమయంలో.. బన్నీ లైకా ప్రొడక్షన్స్ లో ఓ భారీ సినిమా తో పాటు “ఐకాన్” సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బోయపాటి దర్శకత్వంలో కూడా బన్నీ చేయడానికి రెడీ అయినట్లు మీడియాలో న్యూస్ వైరల్ కావడం జరిగింది. కానీ బన్నీ “పుష్ప” మొదటి భాగం భారీ రేంజ్ లో హిట్ కావడంతో సెకండ్ పార్ట్.. అదే స్థాయిలో విజయం సాధించాలని మిగతా ప్రాజెక్టులన్నీ పక్కనపెట్టి… పుష్ప పార్ట్2 పైన కాన్సెంట్రేషన్ పెట్టినట్లు సమాచారం. దీంతో ఐకాన్ ప్రాజెక్టును వదులుకున్నట్టు ఫిలిం నగర్ టాక్. రెండో భాగం లో అల్లుఅర్జున్ ఎర్రచందనం వ్యాపారానికి సంబంధించి మాఫియా లీడర్ గా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మరింత అలరించే రీతిలో సుకుమార్ స్టోరీ లో మార్పులు చేశారు దీంతో “ఐకాన్” సినిమాని పుష్ప.. షూటింగ్ కోసం వదిలేసుకున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


Share

Related posts

Sandeep Kishan: సందీప్ కిషన్ బర్త్ డే స్పెషల్.. మళ్లీ ఆ డైరెక్టర్ తో సందీప్ 28వ సినిమా..

bharani jella

Intinti Gruhalakshmi: తులసి మనసులో ఇంత పెద్ద కుట్ర ఉందా.!? అందుకే ప్రేమ్ ను ఇంట్లో నుంచి గెంటేసిందా!?

bharani jella

ష‌కీలా ల‌వ్ లెట‌ర్‌

Siva Prasad