కోలీవుడ్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టిన బన్నీ…??

ప్రస్తుత పరిస్థితులు బట్టి ఈ ఏడాదిలో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఏకైక హీరో అల్లుఅర్జున్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కరోనా వైరస్ రావటంతో సినిమా థియేటర్లు అయిపోవడంతో సంక్రాంతి పండుగకు వచ్చిన “అలా వైకుంఠపురం లో” ఈ సినిమా ఈ ఏడాది ది బిగ్గెస్ట్ హిట్ మూవీ గా చరిత్ర సృష్టించిందని మేకర్స్ అంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.

Allu Arjun to team up with AR Murugadoss for a bilingual? | Telugu Movie News - Times of Indiaఇదిలా ఉండగా సుకుమార్, వేణు శ్రీరామ్ తర్వాత కొరటాల శివ సినిమాలను లైన్లో పెట్టిన బన్నీ తాజాగా తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టినట్లు టాక్. పూర్తి విషయంలోకి వెళితే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో అల్లు అర్జున్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఇప్పటికే స్టోరీ కూడా మురగదాస్ వినిపించినట్లు సమాచారం. కొరటాల శివ సినిమా తర్వాత ఈ సినిమాలో అల్లు అర్జున్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా చేస్తున్నారు. మహారాష్ట్ర అడవుల్లో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కొరటాల శివ సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తం అంతా కుదిరితే మురుగదాస్ సినిమా అధికారిక ప్రకటన త్వరలో రానున్నట్లు తరువాత కొరటాలతో సినిమా చేసిన తర్వాత మురుగదాస్ తో బన్నీ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.