అల వైకుంఠపురం ఖాతాలో మరో రికార్డు చేరింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైల్ స్టార్ బన్ని, థమన్ సంగీతంలో రూపుదిద్దుకున్న చిత్రం అల వైకుంఠపురంలో నాన్ బాహుబలి రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టింది. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడవ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం తెరమీదే కాదు బుల్లితెర మీద కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. తాజాగా మరో రికార్డు కూడా ఈ చిత్రానికి సొంతమైంది.
తాజాగా నెట్ ఫ్లిక్స్ కొన్ని గణాంకాలను విడుదల చేసింది. నెట్ ఫ్లిక్స్‌లో ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన టాప్ 10 చిత్రాలలో తెలుగు చిత్ర సీమ నుండి అల వైకుంఠపురంలో చిత్రం మాత్రమే స్థానం సంపాదించింది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ బన్ని యాక్టింగ్‌తో పాటు పూజ హెగ్డే గ్లామర్ తోడవడం, థమన్ కూర్చిన బాణీలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ ఏడాది మంచి ఆదరణ పొందిన చిత్రంగా నిలిచింది.
సంక్రాంతి బరిలో విడుదలైన ఈ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ చిత్రాన్ని దాటేసి మరిన్ని రికార్డ్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం బన్నీ క్రేజ్ మరింత పెరిందనే చెప్పావచ్చు, కుటుంబ కథా అంశాన్ని తీసుకొని మాటల మాంత్రికుడు తన రచన శైలితో సుశాంత్, మురళి శర్మ, సముద్రఖని అంటి ముఖ్య తారాగణంతో తెరకెక్కించిన ఈచిత్రంతో మరోసారి మెగా అభిమానుల హృదయాలు కొల్లగొట్టాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం ఎఫెక్ట్ సినిమా మీద బాగా పనిచేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ యూట్యూబ్‌లో భారీగా వ్యూస్ పొందాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు డీవోపీగా పని చేసిన పి.ఎస్. వినోద్ ఈ చిత్రానికి పని చేశారు. బలమైన కథ కాకపోయినా నటీనటుల యాక్టింగ్, స్క్రీన్ ప్లే, సంగీతం అద్భుతంగా ఉండడంతో మంచి విజయాన్ని, మరిన్ని రికార్డులు అందుకుంది.